HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Naidu Adamant To Cids Questions On Skill Development Scam

Skill Development Case : చంద్రబాబును సిట్ అధికారులు ఏ ఏ ప్రశ్నలు అడిగారంటే..

స్కిల్ స్కాం (Skill Development Scam)కు సంబంధించి అధికారులు చంద్రబాబు పాత్రపై ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు.

  • Author : Sudheer Date : 09-09-2023 - 9:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Remand Report
Naidu adamant to CID's questions

టీడీపీ అధినేత చంద్రబాబు ను స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కాం (Skill Development Scam) కేసు లో శనివారం ఉదయం CID అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నంద్యాల పర్యటన లో ఉన్న బాబు ను శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చంద్రబాబు బస చేసిన ప్రాంగణానికి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో వెళ్లి శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నాడు. అక్కడి నుండి రోడ్డు మార్గాన కుంచనపల్లి సిట్ ఆఫీస్ కు తీసుకొచ్చారు. సాయంత్రం 07 గంటల నుండి చంద్రబాబు సిట్ అధికారులు విచారిస్తున్నారు.

విచారణ సమయంలో నలుగురు సీనియర్ అడ్వొకేట్లు అక్కడే ఉండాలని చంద్రబాబు కోరారు. అడ్వొకేట్ల సమక్షంలోనే తనను విచారించాలనీ డిమాండ్ చేశారు. అప్పుడే తాను విచారణకు సహకరిస్తాననీ స్పష్టం చేశారు. తన స్టేట్‌మెంట్‌ను ఆ నలుగురు న్యాయవాదుల సమక్షంలోనే రికార్డు చేయాలని లిఖితపూరకంగా దరఖాస్తు చేసుకున్నారు. సీనియర్ లీగల్ కన్సల్టెంట్, మాజీ ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సీనియర్ కన్సల్టెంట్ పోసాని వెంకటేశ్వర్లు, అడ్వొకేట్ ఎం లక్ష్మీనారాయణ, జవ్వాజి శరత్ చంద్ర సమక్షంలో మాత్రమే తనను విచారించాలని, స్టేట్‌మెంట్‌ను నమోదు చేయాలని చంద్రబాబు పట్టుబట్టారు. దీన్ని సీఐడీ అధికారులు తోసిపుచ్చారు.

Read Also : Chandrababu Arrest : లండన్ లో సీఎం జగన్ కు నిరసన సెగ..

ప్రస్తుతం చంద్రబాబు ఫై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. స్కిల్ స్కాంకు (Skill Development Scam) సంబంధించి అధికారులు చంద్రబాబు పాత్రపై ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. దీనికి ఆయన దాదాపు ఒకే రకమైన సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్పట్లో అధికారులు రాసిన నోట్ ఫైల్స్ ను కూడా చంద్రబాబుకు సీఐడీ అధికారులు చూపించారు. దీనిపై ఆయన వివరణ ఏంటని అడిగారు. దీనికి చంద్రబాబు తెలీదు, నాకు గుర్తులేదు అనే సమాధానాలే ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధుల మధ్య వాట్సాప్ చాట్ ను కూడా సీఐడీ అధికారులు ఆయనకు చూపించారు. చాటింగ్ గురించి ప్రశ్నించగా చంద్రబాబు తెలీదన్నారు. ఓ దశలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మధ్యమధ్యలో సీఐడీ అధికారులు అనుబంధ ప్రశ్నలు సంధించడంతో చంద్రబాబు కాస్త కూల్ అయ్యారని సమాచారం.

చేయని తప్పుకి ఇలా ముద్దాయిలాగా కూర్చోబెట్టి, విదేశాల్లో ఉండి దీన్ని చూస్తూ సైకో ఆనందం పొందుతూ ఉండొచ్చు జగన్ రెడ్డి.. కానీ పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు.. అన్నీ చూస్తున్నాడు.. అంతకు రెండింతలు అనుభవిస్తావ్ గుర్తుపెట్టుకో…#FalseCasesAgainstNaidu#SelfGoalByJagan pic.twitter.com/J0Nk6If9ag

— Telugu Desam Party (@JaiTDP) September 9, 2023


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 20 questions posed by the SIT
  • Chandrababu Arrest
  • CID interogation
  • CID questions
  • SIT
  • Skill Development Case

Related News

Chandrababu Skill Case

చేయని నేరానికి బాబు ను జైల్లో వేశారు ! మరి తప్పు చేసిన మిమ్మల్ని వేయకూడదా ?

కనీస ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని అర్ధరాత్రి వేళ అరెస్టు చేసి, సుమారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచడం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది.

  • Questions Asked By Sit To K

    ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అడిగిన ప్రశ్నలు

Latest News

  • తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం

  • చిత్రసీమను భ్రష్టు పట్టించడానికి ఇలాంటి వాడు ఒక్కడు చాలు !!

  • తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు : గులాబీ నేతలకు గుబులు స్టార్ట్

  • నిరుద్యోగులకు కాగ్నిజెంట్ గుడ్ న్యూస్

  • అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారంటూ పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు!

Trending News

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd