Nabha Natesh : ఆ హీరోయిన్ కి లక్ ఏమాత్రం కలిసి రావట్లేదు..!
ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) తో హిట్ పడినా దాన్ని ఉపయోగించడంలో ఫెయిల్ అయ్యింది నభా. సాయి తేజ్, రవితేజ లాంటి స్టార్స్ తో చేసినా కూడా అమ్మడికి లక్ కలిసి రాలేదు.
- By Ramesh Published Date - 07:26 AM, Tue - 23 July 24

అదేంటో కొందరు హీరోయిన్స్ ఎంత కష్టపడి పనిచేస్తున్నా సరే లక్ మాత్రం కలిసి రాదు. అయితే కథానాయికలు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో తమ కెరీర్ ప్లాన్ చేసుకుంటారు. అందంతో మెప్పించే భామలు కొందరైతే తమ నటనతోనే ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే వారు కొందరు ఉంటారు. ఇస్మార్ట్ బ్యూటీగా క్రేజ్ తెచ్చుకున్న నభా నటేష్ సుధీర్ బాబు (Sudheer Babu) తో నటించిన నన్ను దొచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అందం అభినయం రెండు ఉన్న అమ్మడికి తెలుగులో మంచి పాపులారిటీ వస్తుందని అనుకున్నారు కానీ అది జరగలేదు.
ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) తో హిట్ పడినా దాన్ని ఉపయోగించడంలో ఫెయిల్ అయ్యింది నభా. సాయి తేజ్, రవితేజ లాంటి స్టార్స్ తో చేసినా కూడా అమ్మడికి లక్ కలిసి రాలేదు. ఇక చివరగా 3 ఏళ్ల తర్వాత ప్రియదర్శితో డార్లింగ్ సినిమా చేసింది నభా నటేష్. సినిమా కూడా రీసెంట్ గా రిలీజై అంత గొప్ప టాక్ ఏమి తెచ్చుకోలేదు. సో మళ్లీ నభా నటేష్ కు బ్యాడ్ లక్ తోడైంది.
లేడీ అపరిచితుడు అంటూ ప్రమోట్ చేసి రిలీజ్ చేసిన డార్లింగ్ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం లో ఫెయిల్ అయ్యింది. ఓ పక్క కమెడియన్ గా చేస్తూనే మరోపక్క సోలో సినిమాలు చేస్తున్నాడు ప్రియదర్శి (Priyadarshi). అయితే అతని కెరీర్ లో డార్లింగ్ సినిమా ఆశించిన స్థాయిలో లేదని చెప్పొచ్చు. ప్రియదర్శి తన పాత్ర వరకు బాగానే చేసినా అది సినిమాను కాపాడలేఅపోయింది.
ఇక ఇదిలాఉంటే ప్రియదర్శితో నాని (Nani) ఒక సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. జగదీష్ అనే కొత్త దర్శకుడితో నాని నిర్మాతగా ప్రియదర్శి సినిమా వస్తుంది. ఈ సినిమా ఒక కోర్ట్ రూం డ్రామాగా ఉండబోతుందని తెలుస్తుంది. సినిమా స్క్రిప్ట్ ఆల్రెడీ పూర్తి కాగా త్వరలోనే సెట్స్ మీదకు వెల్తుందట. డార్లింగ్ హిట్ అయితే మళ్లీ అవకాశాలు వస్తాయని అనుకున్న నభా నటేష్ ఈ సినిమా రిజల్ట్ తో మళ్లీ వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది.
Also Read : Mega Heroes : డిసెంబర్ లో మెగా ఫ్యాన్స్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో..?