Hyderabad: జూబ్లీహిల్స్ లో భారీగా పట్టుబడ్డ హ్యాష్ ఆయిల్
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు మందు (Hash Oil) సరఫరా చేస్తున్న వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులతో పాటు టీఎస్‌ఎన్‌ఏబీ అధికారులు పట్టుకున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 04-11-2023 - 8:48 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు మందు (Hash Oil) సరఫరా చేస్తున్న వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులతో పాటు టీఎస్‌ఎన్‌ఏబీ అధికారులు పట్టుకున్నారు. బత్తుల జగదీష్ రెడ్డి వద్ద నుంచి 82 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఒక మొబైల్ ఫోన్, 3 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. .
నిందితుడుబత్తుల జగదీష్ రెడ్డి వయస్సు 30 సంవత్సరాలు. మాదాపూర్ లోని అమిగోస్ బాయ్స్ హాస్టల్ లో ఉంటూ SAP CPI కోర్స్ నేర్చుకుంటున్నాడు. గత ఏడాది కాలంగా నార్కోటిక్ డ్రగ్ వ్యాపారం చేస్తూ హైదరాబాద్ సిటీలో వినియోగదారులకు హాష్ ఆయిల్ విక్రయిస్తున్నాడు. అతను ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో తనకు తెలిసిన వ్యక్తి నుంచి హాష్ ఆయిల్ మందులను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్ లోని వినియోగదారులకు అధిక ధరలకు విక్రయించి తద్వారా సులభంగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఈ విషయాన్ని టీఎస్‌ఎన్‌ఏబీ ఎస్పీ జి.చక్రవర్తి తెలిపారు.
Also Read: Spicy Food : బాగా స్పైసీగా ఉన్న ఆహరం తింటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..