HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # CM Jagan
  • # Business
  • # Jobs
  • # Telangana Formation Day

  • Telugu News
  • ⁄Speed News
  • ⁄Mumbai Beat Lucknow By 81 Runs

LSG vs MI Eliminator: రోహిత్ సేన ఆల్ రౌండర్ షో.. ముంబై దెబ్బకు లక్నో ఔట్

ఐపీఎల్ 16వ సీజన్ లో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రెండో క్వాలిఫైయర్ కు దూసుకెళ్ళింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆ జట్టు 81 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది.

  • By Praveen Aluthuru Published Date - 11:26 PM, Wed - 24 May 23
  • daily-hunt
LSG vs MI Eliminator: రోహిత్ సేన ఆల్ రౌండర్ షో.. ముంబై దెబ్బకు లక్నో ఔట్

LSG vs MI Eliminator: ఐపీఎల్ 16వ సీజన్ లో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రెండో క్వాలిఫైయర్ కు దూసుకెళ్ళింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆ జట్టు 81 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది. అటు బ్యాటింగ్ , ఇటు బౌలింగ్ లో అదరగొట్టిన రోహిత్ సేన ఆల్ రౌండ్ షోతో లక్నోను ఇంటికి పంపించింది. (LSG vs MI)

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ కు ఆశించిన ఆరంభం దక్కలేదు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ త్వరగానే ఔటయ్యారు. అయితే కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ జోరుతో ముంబై ఇన్నింగ్స్ ఫస్ట్ గేర్ లోనే సాగింది. వీరిద్దరూ భారీ షాట్లతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో పవర్ ప్లేలో ముంబై 62 పరుగులు చేసింది. గ్రీన్, సూర్యకుమార్ మూడో వికెట్ కు 66 పరుగులు జోడించారు. కామెరూన్ గ్రీన్ 23 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 41 , సూర్యకుమార్ యాదవ్ 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేశారు. వీరిద్దరూ వెంటవెంటనే ఔటైనప్పటకీ.. తెలుగుతేజం తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ , వధేరా మెరుపులు మెరిపించారు. దీంతో ముంబై స్కోర్ వేగం తగ్గలేదు. తిలక్ వర్మ 22 బంతుల్లో 2 సిక్సర్లతో 26 పరుగులు చేయగా.. వధేరా ధాటిగా ఆడి 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులు చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ 8 వికెట్లకు 182 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో నవీనుల్ హక్ 4 , యశ్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టారు. (MI Beats LSG)

Mumbai Indians

పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా లేకపోవడంతో ఛేజింగ్ అంత ఈజీ కాదని లక్నోకు ముందే అర్థమైంది. ఓపెనర్లు కైల్ మేయర్స్ 18 , మంకడ్ 3 పరుగులకే ఔటయ్యారు. ఈ దశలో కెప్టెన్ కృనాల్ పాండ్యా, స్టోయినిస్ ధాటిగా ఆడి స్కోర్ ముందుకు నడిపించారు. కృనాల్ పాండ్యా 8 పరుగులకే ఔటవగా…ఆయూశ్ బదౌనీ 1 పరుగు చేసి వెనుదిరిగాడు. ఇక ప్రమాదకరమైన నికోలస్ పూరన్ ను మథ్వాల్ డకౌట్ చేయడంతో లక్నో కష్టాల్లో పడింది. అయితే స్టోయినిస్ ధాటిగా ఆడడంతో లక్నో విజయంపై ఆశలు నిలిచాయి. తనదైన షాట్లతో ఆకట్టుకున్న స్టోయినిస్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 40 పరుగులు చేయగా..దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. దీంతో లక్నో ఓటమి ఖాయమైపోయింది. తర్వాత కృష్ణప్ప గౌతమ్ రనౌటవడం… మిగిలిన బ్యాటర్లు కూడా చేతులెత్తేయడంతో లక్నో 101 రన్స్ కే ఆలౌటై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 5 కీలక వికెట్లతో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఈ విజయంతో రెండో క్వాలిఫైయిర్ కు చేరిన ముంబై , గుజరాత్ టైటాన్స్ తో తలపడుతుంది. దీనిలో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది.

Read More: Ban On Dhoni: ధోనీపై నిషేధం.. చెన్నై సారథి ఫైనల్ ఆడతాడా ?

Telegram Channel

Tags  

  • eliminator
  • IPL 2023
  • LSG vs MI
  • LSG: 101 (16.3)
  • MI 182/8 (20)
  • MI Beats LSG
  • Tata IPL 2023
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

MS Dhoni Tears: ధోనీ కళ్ళలో నీళ్లు.. వీడియో వైరల్

MS Dhoni Tears: ధోనీ కళ్ళలో నీళ్లు.. వీడియో వైరల్

ఆఖరి బంతికి నాలుగు పరుగులు కావాలి . మైదానంలో నిశ్శబ్దం. జడేజా చేతిలో బ్యాట్ మరియు మోహిత్ శర్మ బౌలింగ్. చెన్నై, గుజరాత్ ఆటగాళ్లలో టెన్షన్

  • Dhoni Autograph: ధోని ఆటోగ్రాఫ్ కోసం చాహర్ చిన్నపిల్లాడి చేష్టలు

    Dhoni Autograph: ధోని ఆటోగ్రాఫ్ కోసం చాహర్ చిన్నపిల్లాడి చేష్టలు

  • Swiggy: స్విగ్గికి పండగే పండగ.. అంతా ఐపిఎల్ పుణ్యం అంటూ?

    Swiggy: స్విగ్గికి పండగే పండగ.. అంతా ఐపిఎల్ పుణ్యం అంటూ?

  • IPL Effect: రెచ్చిపోయిన ప్రేమికులు.. రికార్డుస్థాయిలో కండోమ్స్, బిర్యానీ ఆర్డర్లు!

    IPL Effect: రెచ్చిపోయిన ప్రేమికులు.. రికార్డుస్థాయిలో కండోమ్స్, బిర్యానీ ఆర్డర్లు!

  • IPL 2023 Highlights: ఐపీఎల్ 2023 హైలైట్స్ – ఆసక్తికర సన్నివేశాలు

    IPL 2023 Highlights: ఐపీఎల్ 2023 హైలైట్స్ – ఆసక్తికర సన్నివేశాలు

Latest News

  • Smart Phones : స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా.. ఈ నొప్పులతో జాగ్రత్త..

  • Evening Walk : సాయంత్రం సమయంలో వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

  • Allu Arjun : బన్నీ ఆ సినిమా చేస్తున్నప్పుడు చికెన్ తినకుండా ఉన్నాడట.. ఏ మూవీ తెలుసా?

  • Krishna : ఎన్టీఆర్ నుంచి కృష్ణకు చేరిన కథ.. కట్ చేస్తే చరిత్ర సృష్టించింది.. ఆ సినిమా ఏంటో తెలుసా?

  • WTC Final 2023: అశ్విన్‌ ‘క్యారమ్ బాల్’ నేర్చుకుంటున్న టాడ్ మర్ఫీ

Trending

    • China Hole To Earth : భూమికి 10 కిలోమీటర్ల రంధ్రం చేస్తున్న చైనా .. ఎందుకు?

    • Modi – Bihar : బీహార్ పై మోడీ ఫోకస్.. జూన్ 12 పాట్నా మీటింగ్ తో అలర్ట్

    • Business Ideas: ఈ బిజినెస్ కి సీజన్‌ తో సంబంధం లేదు.. మార్కెట్ లో విక్రయిస్తే చాలు భారీగా లాభాలు..!

    • Apple – Indian Student : ఇండియా స్టూడెంట్ కు యాపిల్ ప్రైజ్.. ఎందుకు ?

    • Business Ideas: మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయా.. అయితే పెట్టుబడి లేకుండా సులభంగా డబ్బు సంపాదించవచ్చు..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
  • Follow us on:
Go to mobile version