BRS MP: కవిత అరెస్ట్ పై ఎంపీ వద్దిరాజు రియాక్షన్
- Author : Balu J
Date : 22-03-2024 - 6:38 IST
Published By : Hashtagu Telugu Desk
BRS MP: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు ఢిల్లీలో శుక్రవారం ఎంపీలు నామ,కే.ఆర్.మన్నెలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తప్పుడు కేసు బనాయించి అక్రమంగా అరెస్టు చేసిందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసును టీవీ సీరియల్స్ మాదిరిగా రెండేళ్లు సాగదీసి ఎన్నికల వేళ ఇప్పుడు తెరపైకి తెచ్చారని ఈడీ వైఖరిని ఆయన నిశితంగా ఎండగట్టారు. ఎంపీ రవిచంద్ర శుక్రవారం ఢిల్లీలో లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, రాజ్యసభలో తన సహచర సభ్యులు కే.ఆర్.సురేష్ రెడ్డి,మహబూబ్ నగర్ లోకసభ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ ఈడీ 2004 నుండి 2014 వరకు కేవలం 200 కేసులు మాత్రమే నమోదు చేస్తే, 2014 నుండి ఈ 10 సంవత్సరాలలో 2954 పైగా కేసులు పెట్టిందని వివరించారు. ఈ కేసుతో అసలు కవితకు ఎటువంటి సంబంధం లేదని,ఆమె బాధితురాలు మాత్రమే కానీ నిందితురాలు కాదని ఆయన స్పష్టం చేశారు.న్యాయవ్యవస్థపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ధర్మం తప్పకుండా గెలుస్తుందని, కడిగిన ముత్యం మాదిరిగా కవిత ఈ కేసును బయటకు వస్తారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.