Water Board : హైదరాబాద్ లో ‘మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్’..వణికిపోతున్న నగరవాసులు
Water Board : 'మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్' ('Motor free top drive') పేరుతో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో బుధవారం ఒక్కరోజే అధికారులు 32 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు
- By Sudheer Published Date - 11:30 AM, Thu - 17 April 25

హైదరాబాద్ (Hyderabad) నగరంలో నీటి వనరులు (Water Problem) త్వరితగతిన తగ్గిపోతున్న నేపథ్యంలో అక్రమంగా నీటిని తోడేందుకు వినియోగించే మోటార్లపై హైదరాబాద్ జలమండలి (Hyderabad Water Board) కఠిన చర్యలు తీసుకుంటోంది. ‘మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్’ (‘Motor free top drive’) పేరుతో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో బుధవారం ఒక్కరోజే అధికారులు 32 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన 38 మందిపై జరిమానాలు విధించారు. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి స్వయంగా ఎస్సార్‌నగర్, మధురానగర్ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. మధురానగర్‌లో 2 హెచ్‌పీ మోటార్ ఉపయోగించిన వినియోగదారుడిని పట్టుకుని, తదుపరి అటువంటి చర్యలు పునరావృతమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Viral : సంచలనంగా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కూతురు బికిని పిక్స్
అక్రమ మోటార్ల వాడకంతో నీటి సరఫరా అసమంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని హాస్టళ్లు, వాణిజ్య భవనాల్లో 2 హెచ్‌పీ మోటార్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొంతమంది వ్యవసాయ మోటార్లను నివాస భవనాల్లో ఉపయోగిస్తున్నట్టు తెలిసి, వాటి కనెక్షన్లను తొలగించారు. అంతే కాదు నీటి సరఫరాను నెలరోజులపాటు నిలిపివేయడంతో పాటు, ట్యాంకర్ బుకింగ్‌ను బ్లాక్ లిస్ట్ చేయడంలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ చర్యలన్నీ నీటిని సమర్థవంతంగా పంపిణీ చేయాలన్న లక్ష్యంతో తీసుకుంటున్నారు.
నీటి వినియోగం నియంత్రణ ప్రతి పౌరుడి బాధ్యత. ప్రతి ఒక్కరూ నీటిని జాగ్రత్తగా వాడితే మాత్రమే భవిష్యత్తులో నీటి సంక్షోభాన్ని నివారించగలం. షేవింగ్, బ్రషింగ్ వంటి పనుల సమయంలో నీరు వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లీకేజీలను వెంటనే సరిచేసుకోవాలి. వర్షపు నీటిని నిల్వచేసే విధానం తీసుకోవాలి. జలమండలి చేపట్టిన ఈ ‘మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్’ వంటి కార్యక్రమాలు ప్రజల్లో నీటి విలువపై అవగాహన పెంచుతాయి. అందరూ సహకరిస్తే మాత్రమే నగరాన్ని రానున్న నీటి కష్టాలనుంచి రక్షించవచ్చు.