Suicide News: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి
ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి, తానూ విషం తీసుకుంది. మహిళ, ఇద్దరు కుమార్తెలు మృతి చెందగా
- Author : Praveen Aluthuru
Date : 22-06-2023 - 1:00 IST
Published By : Hashtagu Telugu Desk
Suicide News: ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి, తానూ విషం తీసుకుంది. మహిళ, ఇద్దరు కుమార్తెలు మృతి చెందగా..మూడో కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన స్థానికంగా కన్నీరు పెట్టిస్తుంది.
ఉత్తరప్రదేశ్ లో నివాసం ఉంటున్న సంజు, మమతతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఆ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. బుధవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మమత మొదట తన ముగ్గురు కూతుళ్లు ఐదేళ్ల ఆర్చీ, మూడేళ్ల సోనా, ఏడాదిన్నర వయసున్న ఆరుకు లకు పాలలో విషం కలిపి ఇచ్చింది. తరువాత మమత విషం తీసుకుంది.
సమాచారం మేరకు ముగ్గురు పిల్లలతో మమతను జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సంజు అత్త రోమా తెలిపారు. ఆర్చీ మార్గమధ్యంలో మృతి చెందగా, ఆరు, మమత చికిత్స పొందుతూ మృతి చెందారు. సోనా పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
Read More: CM KCR: సార్ ఆకాంక్ష తెలంగాణ సాధించిన ప్రగతిలో ప్రతిబింబిస్తుంది: కేసీఆర్