Astrology : ఈ రాశి వారికి నేడు అనేక శుభ ఫలితాలు రానున్నాయి
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సిద్ధి యోగం వేళ వృషభం, కర్కాటకం సహా ఈ రాశులకు ఊహించని లాభాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
- By Kavya Krishna Published Date - 09:29 AM, Mon - 24 February 25

Astrology : సోమవారం రోజున చంద్రుడు రాశిలో సంచారం చేయనుండగా, పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రాశులకు అదృష్టం వరించగా, మరికొన్ని రాశులకు కొన్ని ప్రతికూలతలు ఎదురుకావచ్చు. ముఖ్యంగా ఏకాదశి సందర్భంలో, వృషభం, కర్కాటకం వంటి రాశుల వారికి ఆర్థికంగా విశేష లాభాలు చేకూరనున్నాయి. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రావొచ్చు. మిగతా రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? వారి రాశి ఫలితాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు తెలుసుకుందాం!
మేషం (Aries)
ఈ రోజు మేష రాశి వారికి అనేక శుభ ఫలితాలు రానున్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆఫీసులో మీ ప్రయత్నాలు ఫలించి ఉన్నత ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా లాభాలు పొందినా, ఖర్చులను నియంత్రించడం మంచిది.
అదృష్ట శాతం: 92%
పరిహారం: సంకట హర గణేశ్ స్తోత్రం పఠించండి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి పిల్లల విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు మరింత శ్రద్ధగా చదవాలి. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. సాయంత్రం దేవాలయ సందర్శన చేయొచ్చు.
అదృష్ట శాతం: 97%
పరిహారం: శునకానికి రోటీ తినిపించండి.
మిథునం (Gemini)
ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కుటుంబ సమస్యలకు తండ్రి ద్వారా పరిష్కారం దొరకొచ్చు. చట్టపరమైన విషయాల్లో కొంత నిరాశ ఎదురవొచ్చు.
అదృష్ట శాతం: 85%
పరిహారం: సరస్వతీ దేవిని పూజించండి.
కర్కాటకం (Cancer)
ఈరోజు ప్రమోషన్ లేదా వేతన పెంపు వంటి శుభవార్తలు వినొచ్చు. కుటుంబం మీ కోసం చిన్న పార్టీ ప్లాన్ చేయొచ్చు. ఆరోగ్య పరంగా తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
అదృష్ట శాతం: 63%
పరిహారం: శ్రీ కృష్ణుడిని పూజించండి.
సింహం (Leo)
ఆర్థికంగా మెరుగైన లాభాలు ఉంటాయి. విద్యార్థులు తండ్రి మార్గదర్శకత్వాన్ని పొందితే విజయాన్ని అందుకుంటారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు.
అదృష్ట శాతం: 98%
పరిహారం: వినాయకుడికి లడ్డూలు సమర్పించండి.
కన్య (Virgo)
ఉద్యోగస్తులు బాధ్యతలు పెరగవచ్చు. ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. జీవిత భాగస్వామి సహాయం లభిస్తుంది. కుటుంబ వ్యాపారంలో తండ్రి సూచనలు ఉపయోగపడతాయి.
అదృష్ట శాతం: 86%
పరిహారం: పార్వతీ దేవిని పూజించండి.
తుల (Libra)
ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్త అవసరం. అర్హులైన వివాహ ప్రతిపాదనలు రావచ్చు. స్నేహితులపై ఆధారపడితే కొంత నిరాశ ఎదురవొచ్చు.
అదృష్ట శాతం: 91%
పరిహారం: విష్ణు జపమాల 108 సార్లు జపించండి.
వృశ్చికం (Scorpio)
బంధువుల ద్వారా లాభాలు కలగవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమజీవితంలో కొత్త దశ ప్రారంభం కావొచ్చు.
అదృష్ట శాతం: 66%
పరిహారం: బ్రాహ్మణులకు దానం చేయండి.
ధనుస్సు (Sagittarius)
ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఓపికతో ముందుకెళ్తే అన్ని పనులూ పూర్తవుతాయి. సహోద్యోగుల సహాయంతో సమస్యలు పరిష్కరించుకోగలరు.
అదృష్ట శాతం: 71%
పరిహారం: ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించండి.
మకరం (Capricorn)
ఖర్చులు పెరిగే అవకాశం. హై స్పీడ్ వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. డబ్బు లావాదేవీలలో సంయమనం పాటించండి.
అదృష్ట శాతం: 77%
పరిహారం: శివుడికి గంధపు తిలకం సమర్పించండి.
కుంభం (Aquarius)
తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. భౌతిక సౌకర్యాలు పొందే అవకాశం ఉంది. పిల్లల భవిష్యత్తు గురించి చర్చించవచ్చు.
అదృష్ట శాతం: 65%
పరిహారం: తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయండి.
మీనం (Pisces)
ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవ్వొచ్చు. జీవిత భాగస్వామితో కలిసి కొత్త ప్రణాళికలు వేయవచ్చు. రుణం తీసుకోవాలనుకుంటే సులభంగా లభించే అవకాశం ఉంది.
అదృష్ట శాతం: 81%
పరిహారం: శని దేవుడిని దర్శించుకుని నూనె సమర్పించండి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన జ్యోతిష్య ఫలితాలు విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Rohit Sharma: వన్డేల్లో వేగంగా 9 వేల పరుగులు చేసిన టాప్- 5 ఓపెనర్లు వీరే.. టాప్‌లో రోహిత్ శర్మ!