HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Modi Hyderabad Tour Traffic Restrictions In The City

Traffic Restrictions: మోడీ హైదరాబాద్ టూర్.. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు!

  • Author : Balu J Date : 07-04-2023 - 10:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Helmet Rule
Helmet Rule

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8న హైదరాబాద్ లో పర్యటించబోతున్న విషయం తెలిసిందే. దీంతో సికింద్రాబాద్ ప్రాంతంలో రేపు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ప్రజలు వేరే రూట్లను ఆశ్రయించాలని ఆయన కోరారు.

ఆయా మార్గాల్లో అలర్ట్

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మోనప్ప జంక్షన్, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాశ్ నగర్, రసూల్‌పుర సీటీవో, ప్లాజా, ఎస్‌బీహెచ్, వైఎంసీఏ, సెయింట్ జాన్ రోటరీ, సంగీత్ ఎక్స్‌రోడ్, ఆలుగడ్డ బావి, చిలకలగూడ జంక్షన్, ఎంజే రోడ్డు, ఆర్పీ రోడ్డు, ఎస్పీ రోడ్డులో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ రోడ్ల వైపు వెళ్లవద్దని కమిషనర్ సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కూడా ప్రధాని మోడీ వస్తారు. కాబట్టి అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు రైలు ద్వారా వెళ్లాలనుకునే వారు ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాలని సూచించారు. ఇక సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ఉప్పల్ – సికింద్రాబాద్ మార్గంలో కూడా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

పార్కింగ్ ఏర్పాట్లు

ప్రధాని మోడీ సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ రూట్లో వచ్చే ఆర్టీసీ బస్సులు దోబీఘాట్‌లో.. ఆదిలాబాద్, నిర్మల్, మెదక్, సంగారెడ్డి వైపు నుంచి వచ్చే బస్సులు బైసన్ పోలో గ్రౌండ్‌లో.. రంగారెడ్డి, కర్నూల్, అచ్చంపేట, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట్, వరంగల్, యాదాద్రి రూట్లో వచ్చే బస్సులు ఆర్ఆర్‌సీ గ్రౌండ్‌లో పార్కు చేయాలని సూచించారు. ఇక రాజీవ్ రహదారి మీద నుంచి వచ్చే వాహనాలను కంటోన్మెంట్ పార్క్ గ్రౌండ్‌లో, పికెట్ డిపో ప్రాంగణంలో పార్కు చేయాలి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్డులో పార్క్ చేయాలి. ప్రధాని పర్యటన సందర్భంగా టివోలి క్రాస్ రోడ్ నుంచి ప్లాజా ఎక్స్‌రోడ్ వరకు రోడ్డు ఇరువైపులా మూసేస్తారు. ఎస్‌బీహెచ్ ఎక్స్ రోడ్ నుంచి స్వీకార్, ఉపకార్ జంక్షన్ వరకు మూసేస్తారు. చిలకలగూడ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, రేతిఫైల్ టీ జంక్షన్ల నుంచి పరేడ్ గ్రౌండ్ వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఉండదు. సికింద్రాబాద్ స్టేషన్ వెళ్లాలంటే ప్రయాణికుల వాహనాలు క్లాక్ టవర్, రెజిమెంటల్ బజార్ రూట్ ఉపయోగించుకోవాలి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Hyderabad Traffic Rules
  • MOdi hyderabad tour
  • pm modi

Related News

Ram Mohan Naidu shared the first look of the 'Made-in-India' C-295 military aircraft.

Ram Mohan Naidu: మేడ్-ఇన్-ఇండియా C-295 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి రూపాన్ని రామ్ మోహన్ నాయుడు పంచుకున్నారు.

పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, భారతదేశంలో తయారైన తొలి ఎయిర్‌బస్ సి-295 విమానాన్ని ప్రదర్శించారు. స్వదేశీ రక్షణ తయారీ, ఏరోస్పేస్ సామర్థ్యాలు మరియు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో దీని పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. వడోదరలో 40 విమానాలను నిర్మించనున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు ఆదివారం, భారతదేశంలో తయారైన తొ

  • Good news for burger lovers: Burger Singh restaurant opens in Hyderabad.

    Burger Singh: బర్గర్ ప్రియులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ లో బర్గర్ సింగ్ రెస్టారెంట్ ప్రారంభం

  • Vikram-1 launch today; PM Modi supports Skyroot mission, describing it as a historic milestone.

    Vikram-1: విక్రమ్-1 ప్రయోగం నేడు.. స్కైరూట్ మిషన్‌కు ప్రధాని మోదీ మద్దతు.. దీనిని ఒక చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు

  • Drug scare in Hyderabad: MLC's son arrested while attempting to purchase drugs.

    Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. కొనుగోలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్‌

  • Controversy over 'Kalma' homework at a private school in Hyderabad; teacher wrote in the diary instructing students to read the Quran.

    హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్‌లో కల్మా’ హోంవర్క్ వివాదం.. ఖురాన్ చదవాలంటూ డైరీలో రాసిన టీచర్

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd