Mlc Kavitha: ఈ హోలీ ఆనందాలు నింపాలి!
హోలీ పండగను పురస్కరించుకొని ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు.
- By Balu J Published Date - 05:24 PM, Thu - 17 March 22

హోలీ పండగను పురస్కరించుకొని ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఈ హోలీ పండుగ తెలంగాణ కుటుంబాల్లో ఆనందాలు నింపాలని, సహజ రంగులతో పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా నిండు చెరువులు మత్తడి దునుకుతూ , పాడి పంటలతో ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య పండగను జరుపుకునే వాతావరణం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిందని అన్నారు. 80,039 ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు శాసనసభలో కేసీఆర్ ప్రకటించారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారన్నారు.
శ్రద్ధ పెట్టి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పరిపాలనలో భాగస్వామ్యం అవ్వండి.#HappyHoli pic.twitter.com/sh8IGPwMmG
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 17, 2022