Ponnam: నీట్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంత్రి అభినందనలు
- By Balu J Published Date - 12:01 AM, Thu - 6 June 24

Ponnam: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల సంస్థ విద్యార్థులు ఈ ఏడాది నీట్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించి రికార్డు సృష్టించారు. 171 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా వారిలో 135 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇందులో 120 మంది బాలికలు, 15 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు 400లకు పైగా మార్కులు సాధించారు. అబ్బాయిల్లో M. చందు – 680 (33-ర్యాంక్)ఎస్. వినీత్ రెడ్డి – 652 (3410-ర్యాంక్), కె. రమేష్ – 630 (22,083-ర్యాంక్)
ఎం. లక్ష్మణ్ – 498, టి.పవన్ – 473 మార్కులు సాధించగా అమ్మాయిల్లో ఎం. మానస (488), బి. రిషిత (437), బి. నాగలక్ష్మి (433), పి. సుస్మిత(429), బి. హర్షిత(424) బి. అనుష (419), ఎం. స్ఫూర్తి (394), ఎంబిబిఎస్ కు అర్హత సాధించారు. మరో 25మంది బిడిఎస్ కోర్సులో చేరేందుకు అర్హత సాధించారు.
అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను , బోధనా సిబ్బందిని అభినందనలు భవిష్యత్ లో మరిన్ని ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.. ఇప్పటికే గురుకులాలు గ్రీన్ ఛానెల్ ద్వారా మెస్ చార్జీలు చెల్లిస్తున్నామని వారికి గురుకులాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టంఇప్పటికే బీసీ గురుకులాలను సొంత భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వాటి పనులు కూడా ప్రారంభం కనున్నాయి,మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు, బోధన సిబ్బందికి అభినందనలు తెలిపారు.