KTR with Gangavva: కేటీఆర్ ను మహేశ్ బాబుతో పోల్చిన గంగవ్వ!
తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఛరిష్మా గురించి అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోనే కాకుండా, సినిమా, ఇతర రంగాల్లో ఆయనకు
- By Balu J Published Date - 11:28 AM, Mon - 3 October 22
తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఛరిష్మా గురించి అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోనే కాకుండా, సినిమా, ఇతర రంగాల్లో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యంగ్ డైనమిక్ లీడర్ గా పేరున్న కేటీఆర్ సినిమా హీరోహీరోయిన్స్ మంచి ర్యాపో ఉంది. గతంలో కేటీఆర్ ఛరిష్మాను ద్రుష్టిలో ఉంచుకొని మహీంద్ర గ్రూప్స్ నిర్వాహకులు ఆనంద్ మహీంద్ర సైతం కేటీఆర్ ను హీరోగా అభివర్ణించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫేం గంగవ్వ కూడా కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అచ్చం మహేశ్ బాబులా ఉన్నావని సరాదాగా ముచ్చటించింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కరీంనగర్ కళోత్సవాల ముగింపు కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ గంగవ్వపై సరదా వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల పాటు సాగుతున్న సాంస్కృతికోత్సవాల ముగింపు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ.. గంగవ్వ తనను టాలీవుడ్ హీరో మహేష్ బాబుతో పోల్చారని, గంగవ్వ మాటలు వింటే మహేష్ బాబు ఫీల్ అవుతారని అన్నారు. గంగవ్వను కూడా తమాషాగా కళ్లను చెక్ చేయమని అడిగాడు. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
Related News
AUS vs PAK: ఫీల్డింగ్ ఎలాగో చేయరు.. బౌలింగ్ లోనూ ఇదే పరిస్థితి
ప్రపంచ క్రికెట్లో మిస్ ఫీల్డింగ్‌తో చివాట్లు తినే జట్టు ఏదంటే పాకిస్థాన్ అని నిర్మొహమాటంగా చెప్తారు ఫాన్స్. చేతుల్లోకి వచ్చిన ఈజీ క్యాచుల్ని నేలపాలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతుంటారు.