TDP vs YSRCP : చంద్రబాబుపై మంత్రి కాకాణి ఫైర్.. ఓటమి భయంతోనే..?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడికి మతిమరుపు...
- By Prasad Published Date - 07:45 AM, Mon - 21 November 22

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడికి మతిమరుపు ఎక్కువైందన్నారు. ఉదయం ఏం మాట్లాడినా రాత్రికి రాత్రే మరిచిపోతున్నారని విమర్శించారు. కర్నూలును రాష్ట్ర న్యాయ రాజధానిగా మార్చడంపై చంద్రబాబు నాయుడు తన ద్వంద్వ వైఖరిని మంత్రి కాకాణి ఖండించారు. 2019 ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు నాయుడు చరిత్ర ముగిసిందని.. 2024 ఎన్నికల్లో ఓటమి భయంతోనే బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని అన్నారు. చంద్రబాబు ప్రసంగాలు చూసి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. చంద్రబాబుని ప్రశ్నించే వారిని వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులుగా ముద్రవేయడాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తప్పుబట్టారు, టీడీపీ నేతలు వివిధ ప్రాంతాల ప్రజల మధ్య విభేదాలు పెంచేందుకే అమరావతి యాత్రలో పాల్గొంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీతో పోలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని ఓ సర్వేలో తేలిందని తెలిపారు.