Indrakaran: కాంగ్రెస్ పక్కా రైతు వ్యతిరేక పార్టీ, ఈసీకి ఫిర్యాదుతో మరోసారి రుజువు
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఈసీకి ఫిర్యాదుతో రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ బట్టబయలైందన్నారు.
- Author : Balu J
Date : 26-10-2023 - 2:40 IST
Published By : Hashtagu Telugu Desk
Indrakaran: రైతుబంధును ఆపాలని ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలి” అని కోరారు. శాస్త్రినగర్ లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఈసీకి ఫిర్యాదుతో రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ బట్టబయలైందన్నారు.
రైతాంగానికి నష్టం చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతుబంధుపై అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఎప్పటిలాగానే ప్రభుత్వం వేసంగి పంట సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తుందని తెలిపారు. రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ పార్టీ చూడటం సరైందని కాదని వ్యాఖ్యానించారు.