Owaisi: రాజాసింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి: అసదుద్దీన్ ఒవైసీ
మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి బీజేపీ ఎంపీ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
- By Hashtag U Published Date - 10:59 PM, Tue - 23 August 22

మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి బీజేపీ ఎంపీ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉందని… ఈ శాంతియుత వాతావరణాన్ని బీజేపీ సహించలేకపోతోందని చెప్పాడు. మహమ్మద్ ప్రవక్తను, ముస్లింలను బీజేపీ ద్వేషిస్తోందని విమర్శించారు.
మన దేశంలో ఉన్న సామాజిక భిన్నత్వాన్ని నాశనం చేయాలనుకుంటోందని చెప్పారు. తమతో పోరాటం చేయాలనుకుంటే రాజకీయపరమైన పోరాటం చేశాలని… ఇలా కాదు అని అన్నారు. రాజా సింగ్ పై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజాసింగ్ మాట్లాడిన వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలని… ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.