Meena Husband Died: సీనియర్ నటి మీనా ఇంట్లో విషాదం…పోస్ట్ కోవిడ్ సమస్యలతో భర్త మరణం.!!
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందారు.
- Author : hashtagu
Date : 29-06-2022 - 12:13 IST
Published By : Hashtagu Telugu Desk
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. కాగా తెలుగుతోపాటు తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మీనా. 2009లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె ఉంది.