Maha Kumbh 2025 : మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం
Maha Kumbh 2025 : సిలిండర్ పేలడం వల్ల సెక్టార్-5లోని టెంట్లలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి
- By Sudheer Published Date - 04:54 PM, Sun - 19 January 25

ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh 2025)లో భారీ అగ్నిప్రమాదం (Massive fire breaks) చోటు చేసుకుంది. యూపీలో అత్యంత ప్రాముఖ్యమైన ఈ మేళాలో భక్తుల శిబిరంలో మంటలు చెలరేగడంతో భయానక వాతావరణం ఏర్పడింది. సిలిండర్ పేలడం వల్ల సెక్టార్-5లోని టెంట్లలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుమారు 30 టెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటన జరిగిన సమయంలో శిబిరాల్లో ఉన్న భక్తులు భయంతో పరుగులు తీశారు. మంటల తీవ్రతతో అక్కడి వాతావరణం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణంగా సిలిండర్ పేలుడు కారణమని ప్రాథమిక సమాచారం.
Sankranti Celebrations: ఆస్ట్రేలియాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొంటున్నారు. కానీ టెంట్లు దగ్ధమవడం వల్ల భక్తుల డబ్బులు, వస్తువులకు తీవ్ర నష్టం జరిగింది. మహా కుంభమేళా సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇలాంటి అగ్నిప్రమాదాలు భక్తులకు అనవసరమైన ఆందోళనను కలిగిస్తాయి. భక్తులు సాధారణంగా శిబిరాల్లో ఉంటారు కాబట్టి భద్రతా చర్యలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేయడానికి కృషి చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.