Sangareddy: పోలీసులు ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడంతో వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్య
సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట ప్రాంతానికి చెందిన సంతోష్ (37) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఫోటోలు తీస్తున్నాడు
- By Praveen Aluthuru Published Date - 10:23 PM, Thu - 1 February 24

Sangareddy: పోలీసులు ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడంతో వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది. సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డి పల్లి జంక్షన్‌లో గురువారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి సదరు పోలీసులను ఫోటోలు తీసే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు తన ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఆ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు .
సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట ప్రాంతానికి చెందిన సంతోష్ (37) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఫోటోలు తీస్తున్నాడు. అతనిని గమనించిన పోలీసులు, వారి ఫోటోలు ఎందుకు తీస్తున్నారంటూ ప్రశ్నించి, అతని ఫోన్‌ను తీసుకున్నారు. ఆవేశంతో సంతోష్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి బాటిల్ లో పెట్రోల్ కొనుక్కున్నాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అయితే స్థానికులు మంటలను ఆర్పి అతడిని కాపాడారు.
సంతోష్‌ను సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడికి 50 శాతం కాలిన గాయాలయ్యాయని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
Also Read: Kurchi Madatapetti Video Song : గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్ వచ్చేసింది..!