Renu Khatoon: చేతిని నరికేసినా తగ్గేదేలే!
- By Balu J Published Date - 03:09 PM, Wed - 8 June 22
ఆ భర్త అనుమానం పెనుభూతంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిలో భార్యకు నర్సు ఉద్యోగం రావడంతో అనుమానం మరింత పెరిగింది. మరో వ్యక్తి కి దగ్గరై.. తనను వదిలిపెడుతుందేమోనని లేనిపోని భయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తన ఇద్దరు స్నేహితులతో కలిసి భార్య చేయి నరికాడు. ఆమె చేతులను దిండుతో అదిమి పట్టుకుని.. పదునైన కత్తితో చేయి నరికేశాడు. ఈ అమానుష ఘటన పశ్చిమ బెంగాల్ లో పశ్చిమ బుర్ద్వాన్ పరిధిలో చోటుచేసుకుంది. భర్త షేర్ మహ్మద్, నర్సు జాబ్ తెచ్చుకున్న భార్య రేణు ఖాతూన్ పై ఈ పైశాచిక దాడి చేశాడు.
రేణు ఖాతున్ దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు దీనిపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్యపై అనుమానంతో జాబ్ కు పంపడం ఇష్టం లేకే ఇలా చేశాడని అంటున్నారు. అయితే కుడి చేయి లేదని నిరాశ చెందకుండా ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఎడమ చేతితో రాయడం ప్రాక్టీస్ చేస్తోంది. కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకున్నానని, జాబ్ చేసి తీరుతానని చెబుతోంది.
Tags
Related News
Romance in Car : పరాయి వ్యక్తి తో కారులో రొమాన్స్ చేస్తుండగా పట్టుకున్న భర్త…
భర్త ఉండగానే..పరాయి వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త కు రెడ్ హ్యాండ్ గా దొరికింది