Delhi: నా భర్త అలాంటి పనులు చేయమంటున్నాడు.. భార్య చెప్పిన మాటలు విని పోలీసులు షాక్?
ఇటీవల కాలంలో చాలామంది చిన్న పెద్ద అని తేడా లేకుండా అశ్లీల వీడియోలకు బాగా అలవాటు పడిపోయారు. పెళ్లయిన పురుషులు కూడా కొంతమంది వీటిని చూస్తూ భా
- By Nakshatra Published Date - 04:30 PM, Wed - 5 July 23
ఇటీవల కాలంలో చాలామంది చిన్న పెద్ద అని తేడా లేకుండా అశ్లీల వీడియోలకు బాగా అలవాటు పడిపోయారు. పెళ్లయిన పురుషులు కూడా కొంతమంది వీటిని చూస్తూ భార్యలకు నరకాన్ని చూపిస్తున్నారు. ఆ వీడియోలో ఉన్న మాదిరిగా సెక్స్ చేయాలని అంటూ చాలామంది ఇప్పుడు భార్యలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చాలామంది భార్యలు వీటిని తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్గొన్న ఘటనలు గతంలో చాలానే చోటు చేసుకున్నాయి. తాజాగా కూడా ఒక వ్యక్తి తన భార్యను అలాగే విసిగించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఈ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల ఒక వివాహిత తన భర్త తన భర్త దారుణంగా ప్రవర్తిస్తున్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది. తన భర్తకు అశ్లీల వీడియోలు చూసే అలవాటు ఉందని, తనని కూడా ఆ వీడియోలను చూడమంటున్నాడు, పోర్న్స్టార్ల మాదిరిగా డ్రెస్ వేసుకోవాలంటూ తనను బలవంతం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఈస్ట్ రోహ్తాస్నగర్కు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా తన భర్త, అతడి కుటుంబ సభ్యులు కట్నం కోసం డిమాండ్ చేస్తున్నారని, మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా సదరు జంటకు 2020లో పెళ్లి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు డీసీపీ రోహిత్ మీనా తెలిపారు. ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని వారు తెలిపారు. ఈ కేసులో తదుపరి చర్యల కోసం సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు డిజిటల్, ఇతర ఆధారాలను సేకరిస్తున్నట్టు చెప్పారు.
Related News
Bomb threat in Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపులు.. మోదీ, ముఖేష్ అంబానీలకు 400 కోట్ల డిమాండ్
ఢిల్లీ ఎన్సీఆర్లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దేశ రాజధాని వ్యాప్తంగా మొత్తం 100కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఢిల్లీలోని సుమారు 100 స్కూళ్లను తాత్కాలికంగా మూసేశారు.