Hyderabad: హైదరాబాద్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం
గత కొంతకాలంగా హైదరాబాద్ మహా నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సికింద్రాబాద్ లో ఓ స్టోర్ లో మంటలు చెలరేగడంతో భవనం పూర్తిగా ధ్వంసం అయింది.
- By Praveen Aluthuru Published Date - 10:45 AM, Sun - 20 August 23

Hyderabad: గత కొంతకాలంగా హైదరాబాద్ మహా నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సికింద్రాబాద్ లో ఓ స్టోర్ లో మంటలు చెలరేగడంతో భవనం పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో ఆరు అంతస్థుల బిల్డింగ్ ని కూలగొట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. ఆ తర్వాత ఇలాంటి అగ్ని ప్రమాద ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం జరిగింది.
A major fire breaks out at a mattress godown in Rajendra Nagar, teams of @Director_EVDM were pressed into service pic.twitter.com/3OUWPX0zp8
— S.M. Bilal (@Bilaljourno) August 20, 2023
రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్రెస్ గోడౌన్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. టాటా నగర్‌లోని గోడౌన్ నుంచి భారీగా పొగలు రావడంతో స్థానికులు పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. కొద్ది నిమిషాల్లోనే రెండు అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. బల్దియా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు కూడా మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టాయి. ఈ గోడౌన్ ఫహీమ్ అనే వ్యక్తికి చెందిందని స్థానికులు చెప్తున్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: Vijayawada: మైనారిటీల ఆస్తులపై తప్ప, సంక్షేమంపై శ్రద్ధ ఏది జగన్!