Hyderabad: రంగోలి ఈపీఎస్ ప్రైవేట్ లిమిటెడ్‌ల్ భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ లోని గగన్‌పహాడ్‌లో ఉన్న రంగోలి ఈపీఎస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన థర్మాకోల్ తయారీ యూనిట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లక్ష్మీగూడ ఇండస్ట్రియల్ ఏరియాలోని మధుబన్ కాలనీలో జరిగిన ఈ ప్రమాదంలో
- By Praveen Aluthuru Published Date - 08:24 PM, Wed - 29 November 23

Hyderabad: హైదరాబాద్ లోని గగన్‌పహాడ్‌లో ఉన్న రంగోలి ఈపీఎస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన థర్మాకోల్ తయారీ యూనిట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లక్ష్మీగూడ ఇండస్ట్రియల్ ఏరియాలోని మధుబన్ కాలనీలో జరిగిన ఈ ప్రమాదంలో భవనం నుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ప్రమాదంలో 2 కోట్ల మేర నష్టం జరిగినట్లు సంబంధిత కంపెనీ అధికారులు చెప్తున్నారు. మంటలను ఆర్పేందుకు ఆరు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రంగోలి ఈపీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ లో అగ్నిప్రమాదానికి కారణం దర్యాప్తులో తేలనుంది. మరిన్ని వివరాలు ఇంకా వెల్లడికావలసి ఉంది. 2019 నుంచి హైదరాబాద్‌లో ఆరు వేలకు పైగా అగ్ని ప్రమాదాలు జరగ్గా, 46 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Hair Dryness : శీతాకాలంలో జుట్టు పొడిబారకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే?