Tamil Nadu CM Stalin : తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అనారోగ్యం.. అపోలో ఆసుపత్రిలో అడ్మిట్
సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. స్టాలిన్ సాధారణ వైద్య పరీక్షలకోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని, మంగళవారం డిశ్చార్జ్ చేస్తామని తెలిపింది.
- By News Desk Published Date - 10:17 PM, Mon - 3 July 23

తమిళనాడు సీఎం స్టాలిన్ (Tamil Nadu CM Stalin )స్వల్ప అనారోగ్యంకు గురయ్యారు. సోమవారం ఆయన్ను అపోలో ఆసుపత్రి (Apollo Hospital ) లో అడ్మిట్ చేశారు. స్టాలిన్ జీర్ణకోశ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గ్రీమ్స్ పెట్ రోడ్డులోని అపోలో హాస్పిటల్‌లో సీఎం చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో స్టాలిన్‌కు ఎండోస్కోపీ పరీక్ష నిర్వహించారు. అయితే, సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. స్టాలిన్ సాధారణ వైద్య పరీక్షలకోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని, మంగళవారం డిశ్చార్జ్ చేస్తామని తెలిపింది. స్టాలిన్ ఆస్పత్రిలో చేరేముందు రాష్ట్రంలో చేపట్టిన రోడ్లు, వంతెనల పనుల స్థితిగతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అదేవిధంగా.. ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్‌తోనూ మాట్లాడారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఆకస్మిక తిరుగుబాటుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేమంతా మీకు మద్దతుగా ఉంటామని తెలిపారు.
Nagarjuna : నాగార్జునకి యాక్షన్ సినిమా కథ చెప్పి.. ఫ్యామిలీ మూవీ తీసిన కృష్ణవంశీ.. ఆర్జీవీ వల్లే..