Leopard: కోతుల వలలో చిక్కుకొని చిరుత పులి మృతి
- By Balu J Published Date - 04:46 PM, Fri - 1 December 23

Leopard: అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం రేగులపాడు గ్రామంలో కోతులను పట్టేందుకు వేసిన వలలో చిక్కుకుని చిరుతపులి మృతి చెందింది. చెట్టుకు అమర్చిన వలలో తలకిందులుగా వేలాడుతున్న చిరుతను గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన రంపచోడవరం డీఎఫ్‌వో జీజీ నరేందర్, సబ్‌డీఎఫ్‌వో శ్రీరామరావు, ఇతర అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బయటకు తీశారు. చిరుతపులి తలక్రిందులుగా ఉండటం వల్ల ప్రాణాలకు ముప్పు అధికారులు గుర్తించారు. ఇటీవల ఏపీలో అటవీ జంతువులకు వరుసగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటం గమనార్హం.