Telangana: సంక్రాంతి పండుగ వరకు రైతుబంధు సంబరాలు
- Author : hashtagu
Date : 08-01-2022 - 4:50 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు ఉత్సవాలు ఈ సంక్రాంతి వరకు జరుపుకోవాలని పార్టీ శ్రేణులను టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు కోరారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ వరకు కొన్ని ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తినుకున్నారు. సంక్రాంతి వరకు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ రైతు బంధు ఉత్సవాలు జరుపు కోవాలని పార్టీ శ్రేణులకు మంత్రి కే. తారకరామారావు సూచించారు.