Ktr Emotional Tweet: నీకు రాఖీ కట్టలేకపోవచ్చు… అండగా ఉంటా: కేటీఆర్
రాఖీ పండుగ (Rakhi festival) సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. సాధారణ ప్రజలతోపాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.
- By manojveeranki Published Date - 01:17 PM, Mon - 19 August 24

Rakhi festival : రాఖీ పండుగ (Rakhi festival) సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. సాధారణ ప్రజలతోపాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో, జైల్లో ఉన్న తన సోదరి కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavita) పై కేటీఆర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
రాఖీ పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో జైల్లో ఉన్న తన సోదరి కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ (Emotional Post) పోస్ట్ చేశారు. ఈరోజు తన సోదరి కవిత తనకు రాఖీ (Rakhi) కట్టలేకపోవచ్చునని, అయితే ఆమె ఏ కష్టాలు వచ్చినా తనకు అండగా ఉంటానని కేటీఆర్ (Ktr) అన్నారు.
ఎక్స్ లో కేటీఆర్ ఏమన్నారంటే.. ఈరోజు రాఖీ కట్టలేకపోవచ్చు. కానీ నువ్వు కష్టపడినా నేను నీకు అండగా ఉంటాను’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కి లవ్ సింబల్ ను జోడించారు. అంతకుముందు, సోదరి కవిత (Kavitha) కేటీఆర్ కు కట్టిన రాఖీ చిత్రాన్ని పంచుకున్నారు.అయితే ఈసారి ఢిల్లీ లిక్కర్ (Delhi Liquor Scam) పాలసీ కేసులో ఆమె తీహార్ జైలులో ఉన్నారు. ఐదు నెలలకు పైగా ఆమె జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో పలుమార్లు విచారణ జరిగినా బెయిల్ మంజూరు కాలేదు. ఈ క్రమంలో వారానికి ఒకటి రెండు సార్లు కేటీఆర్ జైలుకు వెళ్లి కవితతో ములాఖత్ అవుతున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో సోదరి కవితను గుర్తు చేసుకుంటూ కేటీఆర్ చేసిన ఆసక్తికర ట్వీట్ వైరల్‌గా మారింది.