SP Siddharth: ఈ ఎస్పీ అందరి నేస్తం.. సిద్దార్థ్ కౌశల్ కు ‘డిస్క్’ అవార్డు!
ఏపీ పోలీస్ అనగానే తెలుగు రాష్ట్రాల్లో మొదటగా సిద్దార్థ్ కౌశల్ గుర్తుకువస్తారు. కృష్ణా జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకొని ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన బుల్లెట్‌పై రైడ్ చేసి ప్రజల సమస్యలు తెలుకున్నారు.
- By Balu J Published Date - 12:43 PM, Fri - 7 January 22

ఏపీ పోలీస్ అనగానే తెలుగు రాష్ట్రాల్లో మొదటగా సిద్దార్థ్ కౌశల్ గుర్తుకువస్తారు. కృష్ణా జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకొని ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన బుల్లెట్‌పై రైడ్ చేసి ప్రజల సమస్యలు తెలుకున్నారు. తరచుగా బైక్ ర్యాలీ నిర్వహించి, పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యల గురించి తెలుసుకున్నారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్‌పేట ఠాణాను తనిఖీ చేసి, సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. తమపై జరుగుతున్న దాడుల గురించి మహిళలు నిర్భయంగా ముందుకొచ్చి చెప్పుకునేందుకు వీలుగా.. దిశ, స్పందన పోలీసు విభాగాలు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మా మంచి పోలీస్ అనిపించుకున్నారు.
సిద్ధార్థ్ కౌశల్‌కు డీజీ.బీపీఆర్–డీ (డైరెక్టర్ జనరల్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) డిస్క్ అవార్డు లభించింది. కోవిడ్ కంటే ముందే వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని అందరికీ పరిచయం చేసి, స్పందన కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. నేషనల్ పోలీస్ మిషన్‌లో భాగంగా గతేడాది డిసెంబర్ 4వ తేదీన డీజీ, ఐజీలకు నిర్వహించిన కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ లెవల్ బెస్ట్ ప్రాక్టీసెస్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా నలుగురు ఎస్పీ స్థాయి అధికారులను ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఎంపికయ్యారు.
2. Sincere display of Intent is important: while no one can solve all the problems and issues faced by team members.. it should be clearly and unmistakably be seen that one wants to help.. one is prepared to make efforts pic.twitter.com/YMid09Bx8h
— Siddharth Kaushal (@siddharthkausha) January 2, 2022