Kotabommali: ఓటీటీలోకి కోటబొమ్మాళి సినిమా.. ఎప్పుడంటే
- By Balu J Published Date - 05:27 PM, Mon - 1 January 24
Kotabommali: పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కోటబొమ్మాళి PS నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి సానుకూల స్పందనను అందుకుంది. ఇక థియేటర్లలో కంటే ఈ తరహా సినిమాలకే OTT లో క్రేజ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో OTT విడుదలకు సిద్ధమైంది. కోటబొమ్మాళి PS OTT విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆహా వీడియో ద్వారా సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. లింగిడి పాట సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. శ్రీకాంత్ నటనకు సినిమా చూసిన వాళ్ళు కంటతడి పెట్టారు. తేజ మర్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన నయట్టు సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. GA2 పిక్చర్స్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓటీటీ ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Related News
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కెరీర్ ట్రాక్ లో పడేనా.. ?
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో ‘హరి హర వీరమల్లు’, ‘రాజాసాబ్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ ఇద్దరు హీరోలతో నిధికి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. నిధి బ్యాడ్ టైం ఎదుర్కొంటోందని, ఇప్పుడు ఆమె తన కెరీర్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ కు ప్రేమికురాలిగా నటిస్తుండటంతో హరి హర వీరమల్�