iPhone Award: గ్లోబల్ ఐఫోన్ ఫొటోగ్రఫీ అవార్డు గెలిచిన భారతీయుడు..!
వరల్డ్ వైడ్ గా ఔత్సాహిక ఫోటో గ్రాఫర్స్ కోసం అమెరికా పాపులర్ కంపెనీ ఆపిల్ షాట్ ఆన్ ఐఫోన్ పేరుతో మాక్రో ఫొటోగ్రఫీ ఛాలెంజ్ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఈ ఏడాది జనవరి 25న వచ్చింది.
- By Hashtag U Published Date - 02:49 PM, Thu - 14 April 22
వరల్డ్ వైడ్ గా ఔత్సాహిక ఫోటో గ్రాఫర్స్ కోసం అమెరికా పాపులర్ కంపెనీ ఆపిల్ షాట్ ఆన్ ఐఫోన్ పేరుతో మాక్రో ఫొటోగ్రఫీ ఛాలెంజ్ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఈ ఏడాది జనవరి 25న వచ్చింది. ఫిబ్రవరి 16న ఎంట్రీలను ఆమోదించింది. ఈ గ్లోబల్ చాలెంజ్ లో మొత్తం పది మంది ప్రపంచ విజేతల్లో మహారాష్ట్రాలోని కొల్హాపూర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రజ్వల్ చౌగులే కూడా ఉండటం విశేషం. ఆపిల్ నిర్వహిస్తున్న షాట్ ఆన్ ఐఫోన్ మాక్రో చాలెంజ్ కు సంబంధించిన ఫొటో గ్రాఫర్స్ ఆపిల్ ఐఫోన్ 13 ప్రో లేదా ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ను ఉపయోగించి మైక్రో ఫోటోలు షూట్ చేయాలి.
ఈ విధంగా తీసిన ఫొటోలు ఆపిల్ అఫిషియల్ వెబ్ సైట్ కు సమర్పించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఫొటోగ్రాఫర్స్ పోటీపడే ఈ కాంటెస్టుకు ఆపిల్ సంస్థతోపాటుగా ఫొటోగ్రఫీ ఇండస్ట్రికి చెందిన నిపుణులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. తమ వద్దకు వచ్చిన ఎంట్రీల నుంచి చైనా, హంగేరీ, ఇటరీ, స్పెయిన్, థాయిలాండ్, అమెరికాతో సహా మొత్తంగా 10 బెస్ట్ ఫొటోలను ప్యానల్ సెలక్ట్ చేసింది. ఇందులో ప్రజ్వల్ తీసిన ఫొటో కూడా ఉంది.
ఈ పది మంది విజేతల ఫొటోలు యాపిల్. కామ్ వెబ్ సైట్, అఫిషియల్ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ (@apple)తోపాటు ప్రపంచవ్యాప్తంగా సెలక్ట్ చేసిన నగరాల్లోని బిల్ బోర్డ్స్ లో ప్రదర్శిస్తారు. మంచుబిందువుల్లో స్పైడర్ వెబ్ ప్రకృతి ప్రేమికుడైన ప్రజ్వల్ భానోదయ సమయంలో ఫోటోలు తీసేందుకు ఇష్టపడుతుంటాడు. ఈక్రమంలోనే మంచు బిందువులతో అల్లుకున్న సాలీడు గూడు తనను ఆకట్టుకుంది. ఐఫోన్ 13ప్రోలో దాన్ని క్యాప్చర్ చేశాడు. ముత్యాల్లా మెరుస్తున్న నీటి బిందువులతో నేచర్ కాన్వాస్ పై సాలీడు మెడలో ఒదిగిన బంగారు నెక్లెస్ లా కనిపించిన ఈ ఫొటో గోల్డెన్ అవర్ క్యాటగిరిలో అవార్డును సొంతం చేసుకుంది.

చౌగులే తన ఐఫోన్లో క్లిక్ చేసిన విజేత ఫోటో