Kiran Abbavaram: ‘సమ్మతమే’ జూన్ 24న రిలీజ్
హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కుతున్న "సమ్మతమే" చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నారు.
- By Balu J Published Date - 12:30 PM, Fri - 29 April 22

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కుతున్న “సమ్మతమే” చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా సందడి చేస్తుంది. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. చిత్ర యూనిట్ ఇత్ప్పటికే విడుదల చేసిన రెండు పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. యూజీ ప్రొడక్షన్స్‌లో కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ రోజు చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ‘సమ్మతమే’ చిత్రం జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లవ్లీ అండ్ క్యూట్ గా వుంది. హీరోయిన్ చాందిని గార్డెన్‌లో బట్టలు ఆరవేస్తూ కనిపిస్తుండగా, కిరణ్ ఆమెను ప్రేమగా కౌగిలించుకున్న మూమెంట్ బ్యూటీఫుల్ గా వుంది. హ్యాపీ స్మైల్స్ తో వారిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా, సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Related News

Kushi: ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా ‘విజయ్, సమంత’ల ఖుషి!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమాలో నటిస్తున్నారు.