Kiran Abbavaram : కంటెంటే స్థాయిని డిసైడ్ చేస్తుంది..!
తెలుగులో మీడియం రేంజ్ సినిమాలు చేసుకుంటూ వస్తున్న కిరణ్ అబ్బారం ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా రిలీజ్ తో వస్తున్నాడు.
- By Ramesh Published Date - 09:58 PM, Mon - 15 July 24

యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbaram) కెరీర్ లో ఒక డేర్ స్టెప్ వేస్తున్నాడు. వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఆ తర్వాత రెండు డిజాస్టర్ లు అందుకున్నాడు. ఐతే ఈసారి సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో వస్తున్నాడు. సుజీత్ అండ్ సందీప్ (Sujith and Sandeep) దర్శక ద్వయం డైరెక్ట్ చేస్తున్న క సినిమాతో తన లక్ టెస్ట్ చేసుకోబోతున్నాడు కిరణ్ అబ్బవరం.
ఈ సినిమాకు సంబందించిన ఇంట్రెస్టింగ్ టీజర్ (KA Teajer) రిలీజైంది. ఇన్నాళ్లు తెలుగులో మీడియం రేంజ్ సినిమాలు చేసుకుంటూ వస్తున్న కిరణ్ అబ్బారం ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా రిలీజ్ తో వస్తున్నాడు. క సినిమాను నేషనల్ వైడ్ రిలీజ్ చేస్తూ షాక్ ఇస్తున్నాడు.
ఐతే ఈ సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగా తెలుగులోనే ఒక సూపర్ హిట్ అందుకోని మీరు పాన్ ఇండియా సినిమా ఎలా తీస్తారంటూ మీడియా నుంచి ప్రశ్న వచ్చింది. ఐతే ఈ ప్రశ్నకు కిరణ్ స్లిప్పర్ షాట్ లాంటి ఆన్సర్ ఇచ్చాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమా ఆడాలంటే హీరో ఎవరన్నది కాదు కంటెంట్ ఉంటే చాలని. కంటెంటే స్థయిని డిసైడ్ చేస్తుందని అన్నాడు కిరణ్ అబ్బవరం.
రీసెంట్ గా వచ్చిన మంజుమ్మల్ బోయ్స్, కాంతార టైం లో రిషబ్ శెట్టి (Rishab Shetty) వీళ్లేరు మన ఆడియన్స్ కు తెలియదు కానీ ఆ సినిమాలు సూపర్ హిట్ చేశారు. అలానే కంటెంట్ ఉంటే అది ఎలాంటి సినిమా అయినా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వస్తుందని చెప్పారు. క సినిమా లో ఆ కంటెంట్ ఉంది కాబట్టే ఇలాంటి అటెంప్ట్ చేస్తున్నామని అన్నాడు కిరణ్ అబ్బవరం. చూస్తుంటే కిరణ్ అబ్బవరం క తో పెద్ద ప్లాన్ వేసినట్టే అనిపిస్తుంది. సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే మాత్రం కుర్ర హీరో ఫేట్ మారినట్టే లెక్క.