రెండేళ్లలోనే రికార్డు సృష్టించిన కారు.. ఇప్పటి వరకు ఎన్ని అమ్ముడుపోయాయో తెలిస్తే షాక్?
- By Nakshatra Published Date - 09:00 AM, Wed - 22 June 22

కొరియన్ వాళ్ళు స్థాపించిన కార్ల తయారీ కంపెనీ ప్రస్తుతం ఇండియా మార్కెట్ లో పాతుకు పోతుంది. కంపెనీ తయారు చేసిన కార్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే పలు రకాల కంపెనీ కార్లు కస్టమర్లను ఆకట్టుకోగా సెల్టోస్ కంపెనీ కారు సక్సెస్‌ఫుల్ మోడల్‌గా పేరును తెచ్చుకుంది. సెల్టోస్ బాటలోనే పయణిస్తోంది సోనెట్ మోడల్. కరోనా మహమ్మారి తరువాత ఇండియాలో కార్ల కొనుగోలు చాలా వరకు తగ్గి పోయిన విషయం తెలిసిందే.
అయితే ఏళ్ల తరబడి మార్కెట్‌లో ఉన్న కంపెనీల నుంచి రిలీజ్ అవుతున్న కార్లు కూడా కిందా మీదా అవుతున్నాయి. కానీ కియా నుంచి వచ్చిన సోనెట్ మోడల్ అమ్మకాల్లో ఒక్కో రికార్డు బ్రేక్ చేస్తూ శరవేగంగా దూసుకెళ్తోంది. కియా సంస్థ 2020 సెప్టెంబరులో సొనెట్ మోడల్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. రెండేళ్లు కూడా పూర్తి కాకముందే కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల నడుమ ఇండియాలో లక్షన్నర యూనిట్ల అమ్మకం రికార్డును సోనెట్ క్రాస్ చేసింది.
కానీ కియో మొత్తం అమ్మకాల్లో కేవలం సోనెట్ వాటాయే 26 శాతానికి చేరుకుంది. అంతేకాదు కాంపాక్ట్ ఎస్‌యూవీ కేటగిరిలో సోనెట్ వాటా 15 శాతంగా ఉంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ కేటగిరిలో సోనెట్ పవర్ ప్యాక్డ్ మోడల్‌గా నిలుస్తోంది.అధునాత ఇన్ఫోంటైన్‌మెంట్ సిస్టమ్, 16 ఇంచ్ ఎల్లాయ్ వీల్స్, మల్టీపుల్ ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఆండ్రాయిడ్,యాపిల్ కనెక్టివిటీ, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి ఫీచర్లు ఉన్నాయి. హైఎండ్ మోడల్ వేరియంట్ ధర రూ.16.88 లక్షలుగా ఉంది.
Tags
- Kia Sonet
- Kia Sonet 1.5 Lakh Sales Milestone
- Kia Sonet 2022
- Kia Sonet Car Sales
- Kia Sonet Sales Milestone
- Sonet Car Sales
