KGF2: ‘కేజీఎఫ్-2’ నుంచి అదిరే అప్డేట్!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా తర్వాత ఆ స్థాయిలో పేరు గడించిన చిత్రం 'కేజీఎఫ్'.
- By Hashtag U Published Date - 01:11 PM, Sun - 13 February 22
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా తర్వాత ఆ స్థాయిలో పేరు గడించిన చిత్రం ‘కేజీఎఫ్’. అంతేకాదు, యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ... విడుదల ముందు వరకు పెద్దగా ప్రచారం కూడా చేయలేదు. అయినప్పటికీ రిలీజ్ తర్వాత మాత్రం ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది. దేశవ్యాప్తంగా కన్నడ చిత్ర పరిశ్రమ గురించి అందరూ చర్చించుకునేలా చేసింది ఈ చిత్రం. యశ్ ను ‘కేజీఎఫ్’ సినిమా పాన్ ఇండియా స్టార్ ని చేసిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే, విడుదలైన అన్ని భాషల్లో ‘కేజీఎఫ్’ ఘన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను రాబట్టిన నేపథ్యంలో… ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం అందరికీ తెలిసిందే. ‘కేజీఎఫ్’ ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో… ఇప్పుడు సెకండ్ పార్ట్ పై అందరి దృష్టి పడింది.
ఇప్పటికే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా… కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ‘కేజీఎఫ్-2’ ను ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో… చిత్ర యూనిట్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే, ‘కేజీఎఫ్’ ఫస్ట్ పార్ట్ హిందీలో కూడా విడుదలై, మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన తారలను కూడా ఇందులో నటింపజేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే, అప్పుడెప్పుడో విడుదలైన టీజర్ తప్ప.. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ‘కేజీఎఫ్ పార్ట్ -2’ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
ఈ క్రమంలో ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచేందుకు మూవీ మేకర్స్ ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ నెల 25న సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రానప్పటికీ… ఈ విషయమై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ‘కేజీఎఫ్’ తొలి భాగం వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో.. ఇప్పుడు ‘కేజీఎఫ్ -2’ పై అంచనాలు అమాంతం పెరిగాయి. దీంతో మొదటి నుంచి ఈ సినిమా పై ఉన్న హైప్ ను దృష్టిలోపెట్టుకుని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ పార్ట్ -2’ ను ఓ రేంజ్ లో తెరకెక్కించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ‘కేజీఎఫ్ పార్ట్ -2’ ఎంతటి విజయాన్ని నమోదు చేస్తుందో అన్నది వేచి చూడాలి.
Tags
Related News
Toxic : యశ్ సినిమా నుంచి బాలీవుడ్ హీరోయిన్ అవుట్.. ఆ స్థానంలోకి..
యశ్ 'టాక్సిక్' సినిమా నుంచి బాలీవుడ్ హీరోయిన్ బయటకి వెళ్లిపోయిందట. ఆమె స్థానంలోకి ఆ సౌత్ హీరోయిన్..