HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kcr Calls For State Wide Protest Against Anti Congress Actions

KCR: కాంగ్రెస్ వ్యతిరేక చర్యలపై కేసీఆర్ ఫైర్..

  • Author : Balu J Date : 15-05-2024 - 9:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr (6)

KCR: రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా.. రేపు, (గురువారం.,16.05.24)రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రేస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి..ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం,మోసం చేయడం, దగా చేయడమే” నని కేసీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్ర కాంగ్రేస్ ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలను ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

“రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తది.?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. “సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రేస్ ప్రభుత్వం మరోసారి వంచించింద”న్నారు. “ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరింది. అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారు. ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు గనుక చెప్పింటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్లు. ఇప్పటికీ ప్రజలు ఆగ్రహం తోనే ఉన్నారు. రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రేస్ పార్టీ మోసం చేస్తున్నది. అందు కారణంగానే రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకే బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టింది.” అని కేసీఆర్ స్పష్టం చేశారు.

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులపక్షాన నిలబడి కొట్లాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చుకుంటున్నదని..ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించేదిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ వడ్ల కల్లాలకాడికి బిఆర్ఎస్ శ్రేణులు పోవాలని…రైతులకు అండగా నిలవాలని బీఆర్ఎస్అధినేత పిలుపునిచ్చారు. రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అధినేత కేసీఆర్ పునరుద్ఘటించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • hard comments
  • kcr
  • TCongress

Related News

Questions Asked By Sit To K

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అడిగిన ప్రశ్నలు

ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని నంది నగర్ ఉన్న కేసీఆర్ నివాసంలో మాదాపూర్ డీసీపీ రీతి రాజ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఐపీఎస్ అధికారుల బృందం సుమారు ఐదు గంటల పాటు ఆయనను విచారించింది

  • Kcr Nandinagar

    Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్‌

  • Kcr Hc

    సిట్ నోటీసులపై కేసీఆర్ హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారా ?

  • Kcr Pm 3

    ఫోన్ ట్యాపింగ్ పై గతంలో KCR చేసిన వ్యాఖ్యలు ఇవే..!!

  • Sit Inquiry Kcr

    నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

Latest News

  • Parliament : ప్రధాని మోదీపై దాడికి యత్నించిన మహిళా ఎంపీలు

  • ఇలా తయారేంట్రా బాబు !! భర్త ను ప్రియుడితో కలిసి ఆక్సిడెంట్ చేసి హత్య చేసిన భార్య

  • IT Act: ఈ నెలాఖరులోగా కొత్త ఐటీ రూల్స్

  • యాటిట్యూడ్ స్టార్ చేసిన పనికి తలలు పట్టుకున్న నిర్మాతలు

  • లోక్‌సభలో గందరగోళం.. ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానానికి ఆమోదం!

Trending News

    • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd