Amita Bachchan : చంద్రుడిపై కౌన్ బనేగా కరోడ్ పతి: అమితాబ్
బాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్ (Amita Bachchan) ప్రముఖ అమెరికన్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ను బాగా ప్రశంసించారు.
- Author : Maheswara Rao Nadella
Date : 05-09-2023 - 12:00 IST
Published By : Hashtagu Telugu Desk
Amita Bachchan’s Kaun Banega Karod Pati : బాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్ ప్రముఖ అమెరికన్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ను బాగా ప్రశంసించారు. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో ఈ సంగతి చోటు చేసుకుంది. సోనీ టీవీలో కౌన్ బనేగా కరోడ్ పతి 15వ ఎపిసోడ్ ఈ నెల 4న ప్రసారమైంది. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో పంజాబ్ లోని పఠాన్ కోట్ కు చెందిన అపూర్వ మెహతా విజేతగా నిలిచి, అమితాబ్ (Amita Bachchan) ముందు ఆసీనులయ్యారు. రూ.3,20,000 బహుమతిని గెలుచుకున్నారు. రెండో రౌండ్ లో పంజాబ్ కే చెందిన జస్ కరణ్ సింగ్ అనే బీఎస్సీ విద్యార్థి ఎంపికయ్యాడు.
జస్ కరణ్ తాను ఎదుర్కొన్న అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ గురించి అమితాబ్ ప్రస్తావన చేశారు. ‘‘ఎలాన్ మస్క్ అపురూపమైన మానవుడు. అతడు ఎప్పుడూ కొత్త వాటిని ఆవిష్కరిస్తూ ఉంటాడు. తదుపరి ఆవిష్కరణ అంతరిక్షంలో ఉంటుందని, మనమంతా అక్కడ ఉంటామని మనల్ని నమ్మేలా చేశాడు. ప్రస్తుత పరిశోధనలు చూస్తుంటే అది త్వరలోనే సాకారం అవుతుందని తెలుస్తోంది. అదే జరిగితే చంద్రుడిపైనా కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం నిర్వహించే రోజు వస్తుంది’’ అని అమితాబ్ పేర్కొన్నారు.
Also Read: Hyderabad: భారీ వర్షాల ఎఫెక్ట్, హైదరాబాద్ లో అన్ని విద్యాసంస్థలకు సెలవ్!