Kashmir Files: 100 కోట్ల చేరువలో కశ్మీర్ ఫైల్స్..!
- By HashtagU Desk Published Date - 04:55 PM, Thu - 17 March 22

కథలో విసయం ఉండాలే కానీ భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ అవసరం లేదని తాజాగా విడుదల అయితన కశ్మీర్ ఫైల్స్ చిత్రం నిరూపించింది. అసలు విడుదల అయ్యేంత వరకు కశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి ఏ ఒక్కరికీ తెలియదు. అయితే సైలెంట్‌గా థియేటర్స్‌లోకి వచ్చిన కశ్మీర్ ఫైల్స్ సినిమా, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అతి తక్కువ బడ్జెత్‌తో తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ చిత్రం వారంలోనే 70 కోట్లు కలెక్ట్ చేసిందని ట్రెడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక రేపు హోలీ శెలవుతో పాటు వీకెండ్ కావడంతో మరో రెండు రోజుల్లోనే ఈ సినిమా కలెక్షన్లు 100 కోట్లు క్రాస్ చేయొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలావుంటే ప్రముఖ రచయిత చేతన్ భగత్ ఈ చిత్రంపై విమర్శలు గుప్పించారు. కశ్మీర్‌లో పండిట్లు, హిందువులపై జరిగిన అకృత్యాలు, ఊచకోతలను యావత్ ప్రచంచానికి తెలియజెప్పే లక్ష్యంతో దర్శకుడు వివేక్ అగ్నిహోత్ని తీశారంటూ విమర్శలు చేశారు. ఫన్నీ ఏంటంటే భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి తరచూ అడిగేవారే కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి వచ్చేసరికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ చేతన్ భగవత్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.