Kalonji Face Pack: నల్ల జీలకర్రతో ఫేస్ ప్యాక్.. ఈ బెనిఫిట్స్ మీ సొంతం..
చర్మంలో సహజ తేమ పోయి, బిగుతుగా మారడం, కాలుష్య ప్రభావం వల్ల కూడా చర్మం పాడవుతుంది. పైగా శీతాకాలంలో ఏ ఫేస్ ప్యాక్ నూ ఎక్కువసేపు ఉంచుకోలేరు.
- Author : News Desk
Date : 01-12-2023 - 9:08 IST
Published By : Hashtagu Telugu Desk
Kalonji Face Pack: శీతాకాలం వచ్చిందంటే చాలు.. చర్మం డ్రై గా అయి.. గోరుతో గీస్తే తెల్లగా మచ్చ పడుతుంది. ఇక ముఖం, పెదాల సంగతైతే చెప్పనక్కర్లేదు. ఎక్కికక్కడే పగిలి.. మంట పుడుతుంటుంది. వాటిని తగ్గించుకునేందుకు మార్కెట్లో ఉండే రకరకాల ఫేస్ ప్యాక్ లను వాడుతుంటాం.
చర్మంలో సహజ తేమ పోయి, బిగుతుగా మారడం, కాలుష్య ప్రభావం వల్ల కూడా చర్మం పాడవుతుంది. పైగా శీతాకాలంలో ఏ ఫేస్ ప్యాక్ నూ ఎక్కువసేపు ఉంచుకోలేరు. కానీ.. శీతాకాలంలో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే అందం రెట్టింపవుతుంది. మరి నల్ల జీలకర్రతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం.
2 చెంచాల నల్ల జీలకర్ర పొడిలో 2 చెంచాల బియ్యంపిండి కలుపుకోవాలి. ఇందులోనే అరస్పూన్ గ్లిజరిన్, సరిపడానీరు పోసి కలిపి.. మూతపెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి.
ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె కలుపుకోవాలి. నీళ్లకు బదులు పాలు కూడా వాడొచ్చు. ముఖానికి ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుని 10 నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత వెట్ క్లాత్ తో ముఖాన్ని తుడుచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మొటిమలను, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. వారానికి 2 సార్లు ముఖానికి ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి.