Kalki Director Nag Aswin Liked two Scenes in his movie : కల్కి లో డైరెక్టర్ కి నచ్చిన రెండు సీన్స్ అవేనా..?
దీపిక పదుకొనె నిప్పుల మధ్యలో నడిచే సీన్ ఒకటని చెప్పగా మరోటి క్లైమాక్స్ లో అశ్వద్ధామ, భైరవ మధ్య ఫైట్ సీన్ అని
- By Ramesh Published Date - 11:24 AM, Sat - 6 July 24

కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Aswin) కి తన సినిమాలో నచ్చిన రెండు సీన్స్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. కల్కి 2898AD (Kalki 2898AD) సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తనకు ఇష్టమే అని ఐతే ప్రత్యేకంగా చెప్పమంటే మాత్రం దీపిక పదుకొనె నిప్పుల మధ్యలో నడిచే సీన్ ఒకటని చెప్పగా మరోటి క్లైమాక్స్ లో అశ్వద్ధామ, భైరవ మధ్య ఫైట్ సీన్ అని అన్నారు. ఏ సినిమాకైనా క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్ అని ఈ సినిమా క్లైమాక్స్ గురించి అందరు మాట్లాడుకోవడం తనని సంతోష పరచిందని అన్నారు నాగ్ అశ్విన్.
అంతేకాదు కల్కి ముందు ఒక సినిమాగానే చేయాలని అనుకోగా కథ చాలా పెద్దగా రావడంతో రెండు భాగాలుగా చేయాల్సి వచ్చిందని అన్నారు. వైజయంతి బ్యానర్ కాబట్టే సినిమాను ఇంత గ్రాండియర్ గా తీయగలిగాం అంటున్నారు నాగ్ అశ్విన్. సినిమాలో ప్రభాస్, అమితాబ్ (Amitabh Bacchan), కమల్ హాసన్, దీపిక పదుకొనే (Deepika Padukone) వీరి నలుగురి పాత్రలు హైలెట్ గా నిలిచాయని అన్నారు.
సినిమా ఇప్పటివరకు 40 శాతం మాత్రమే అని అసలు సినిమా సెకండ్ పార్ట్ లో ఉంటుందని అన్నాడు. కల్కి పార్ట్ 1లో విజయ్ దేవరకొండ, దుల్కర్ ల క్యామియో ఉండగా సెకండ్ పార్ట్ లో నాని, నవీన్ పొలిశెట్టి పాత్రలు సర్ ప్రైజ్ చేస్తాయని అన్నారు నాగ్ అశ్విన్. మొత్తానికి నాగ్ అశ్విన్ చాలా క్లారిటీతోనే ఉన్నాడని అర్ధమవుతుంది.
Also Read :