JIO OTT Plans: ఓటిటి వినియోగదారుల కోసం JIO కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు
OTT వినియోగదారుల కోసం టెలికాం సంస్థ రిలయన్స్ జియో (JIO) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు తీసుకొచ్చింది. రిలయన్స్ జియో తన వినియోగదారుల సౌలభ్యం కోసం వివిధ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.
- Author : Praveen Aluthuru
Date : 05-10-2023 - 11:35 IST
Published By : Hashtagu Telugu Desk
JIO OTT Plans: ఓటిటి (OTT) వినియోగదారుల కోసం టెలికాం సంస్థ రిలయన్స్ జియో (JIO) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు తీసుకొచ్చింది. రిలయన్స్ జియో తన వినియోగదారుల సౌలభ్యం కోసం వివిధ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఆ తరహాలో OTT స్ట్రీమింగ్‌ను ఆస్వాదించే వినియోగదారుల కోసం రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. జియో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు సీ5 మరియు సోనీలైవ్ సబ్‌స్క్రిప్షన్‌లతో వస్తాయి. దీనితో వినియోగదారులు జియో సినిమా యాప్, సోనీ లైవ్ (SonyLive) మరియు C5లో ప్రీమియం ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కొత్త ప్లాన్ లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. జియో 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ రూ. 3662తో రోజుకు 2.5 GB డేటా మరియు 64 kbps స్పీడ్ తో అపరిమిత డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలను కూడా పొందుతారు.
Also Read: Russia Ukraine War: రష్యా దాడిలో 49 మంద్రి ఉక్రెయిన్ పౌరులు మృతి