Japan Moon Mission: జపాన్ ల్యాండర్ మిషన్ విజయవంతం
ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష పరిశోధన సంస్థలు రాకెట్లను ప్రయోగిస్తూ జాబిల్లిపై తమ ఉనికిని చాటాలని ఆరాటపడుతున్నాయి.
- By Praveen Aluthuru Published Date - 02:15 PM, Thu - 7 September 23

Japan Moon Mission: ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష పరిశోధన సంస్థలు రాకెట్లను ప్రయోగిస్తూ జాబిల్లిపై తమ ఉనికిని చాటాలని ఆరాటపడుతున్నాయి. ఈ మధ్యే భారత్ ఇస్రో చంద్రయాన్3 ని ప్రయోగించి సక్సెస్ సాధించింది. ఆ వెంటనే ఆదిత్య L1 ఏకంగా సూర్యుడి వద్దకు పంపింది. తాజాగా జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ (SLIM)ను గురువారం విజయవంతంగా ప్రయోగించింది. కగోషిమాలోని తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించిన రాకెట్ దూసుకెళ్లింది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) సహకారంతో జపాన్ స్పేస్ ఏజెన్సీ ఈ మిషన్‌కు నాయకత్వం వహిస్తోంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ టెలిస్కోప్ నిర్మాణానికి సహకరించింది, అంటే యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలు టెలిస్కోప్ పరిశీలన సమయంలో కొంత భాగాన్ని కేటాయించారు.
జపాన్ ల్యాండర్ విజయవంతం కావడంతో ఇస్రో జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థకి అభినందనలు తెలిపింది. నాసా కూడా జాక్సా ని అభినందించింది.
Also Read: September 17 : పార్టీలకు ఫక్తు `పొలిటికల్ డే`