AP Politics : పొత్తు ఫిక్స్ అయ్యింది..ఇక వార్ వన్ సైడే
జగన్ నీకు ఆరు నెలలే. యుద్దమే కావాలంటే యుద్దమే ఇస్తాం. ఖచ్చితంగా ఏ ఒక్కర్ని వదలం
- By Sudheer Published Date - 02:09 PM, Thu - 14 September 23

జగన్ నీకు ఆరు నెలలే. యుద్దమే కావాలంటే యుద్దమే ఇస్తాం. ఖచ్చితంగా ఏ ఒక్కర్ని వదలం అని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గత కొద్దీ నెలలుగా నెలకొని ఉన్న ఉత్కంఠ కు తెరదించారు పవన్. ఈరోజు పవన్ కళ్యాణ్ అందరికి సమాధానం చెప్పాడు..నిన్నటి వరకు రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయా..చేయవా..? దీనికి పవన్ ఏమంటారు..? చంద్రబాబు ఏమంటారు..? అసలు పొత్తు ఉంటుందా..లేదా..? కలిసి పోటీ చేసే ఛాన్స్ ఉందా..లేదా..? అంటూ మీడియా వారు.. మిగతా పార్టీ నేతలు మాట్లాడుకుంటూ.. ప్రశ్నించుకుంటూ..ప్రశ్నలు వేస్తూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ఈరోజు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి పోటీ (Janasena TDP Alliance) చేయబోతున్నాం..ఇక వార్ వన్ సైడ్ అయినట్లే అని చెప్పకనే చెప్పాడు. ఈ ప్రకటన తో టీడీపీ , జనసేన కార్యకర్తలు సంతోషంలో మునిగిపోయారు.
స్కిల్ డెవలప్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేసి రాజమండ్త్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. ఈ క్రమంలో నేడు గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ , లోకేష్ లు కలిసి చంద్రబాబు తో మాట్లాడారు. దాదాపు 45 నిమిషాల పాటు చంద్రబాబు తో మాట్లాడిన పవన్ ..అనంతరం మీడియా ముందుకు వచ్చి కీలక ప్రకటన తో పాటు వైసీపీ ప్రభుత్వం ఫై , జగన్ తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ”రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి వెళ్తాయి’’ అని పవన్ (Pawan Kalyan) ప్రకటించారు.
జగన్ నీకు ఆరు నెలలే. యుద్దమే కావాలంటే యుద్దమే ..
రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ,జనసేన కలిసి వెళ్ళాలనేది తన కోరికని పవన్ తెలిపారు. వైసీపీ అరాచకాలను అడ్డుకోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే కుదరదన్నారు. జగన్ నీకు ఆరు నెలలే. యుద్దమే కావాలంటే యుద్దమే ఇస్తాం. ఖచ్చితంగా ఏ ఒక్కర్ని వదలం. మాజీ ముఖ్యమంత్రినే కూర్చోబెడితే మీ పరిస్థితే అర్థం చేసుకోండి’’ అని పవన్ అధికారులను సైతం హెచ్చరించారు.
సైబరాబాద్ సంపూర్ణమైన సిటీ నిర్మించిన వ్యక్తి .. 300 కోట్లు స్కామ్ చెస్తాడా..?
‘గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. అందులో భాగంగానే మాజీ సీఎం చంద్రబాబును అక్రమ కేసులు పెట్టి రిమాండుకు పంపించారు. వారికి సంఘీభావం ప్రకటించడానికి ఇక్కడకు వచ్చాను. బ్యాంకులో సిబ్బంది చేసిన తప్పునకు బ్యాంకు మేనేజర్‌ని తప్పుబడుతామా? ప్రతి విషయాన్ని సీఎంకి లిక్ చేస్తామా. గతంలో దీన్ని గుజరాత్ లాంటి రాష్ట్రంలో కూడా అమలు చేశారు. లక్షలాది టర్నోవర్‌ను తీసుకొచ్చే హైటెక్ సిటీని చంద్రబాబు తెచ్చారని గుర్తుచేశారు. 2020 విజన్‌తో చంద్రబాబు ముందుకెళ్లారని అన్నారు. అలాంటి వ్యక్తి 300 కోట్లు అవినీతి చేసారని జైల్లో పెట్టడం చాల బాధాకరం అన్నారు. అవినీతి బురదలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వం ఆ బుదరను అందరిపైనా చల్లాలని ప్రయత్నిస్తోందని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. జగన్ చేసేవి అన్నీ రాజ్యాంగ ఉల్లంఘన పనులేనని విమర్శించారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని, అందులో భాగమే చంద్రబాబు అరెస్ట్ అని పవన్ వ్యాఖ్యానించారు.
ఈడీ విచారణ లేకుండా చంద్రబాబుని జైలులో ఎలా కూర్చోబెడతారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. చంద్రబాబుని జైలులో కూర్చోబెట్టడం రాష్ట్రానికి మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక నేరాల్లో కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్ అని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అడ్డగోలుగా జగన్ దోచుకుంటున్నాడని ధ్వజమెత్తారు. తనలాంటోడీతీ సరిహద్దులు దాటకుండా ఆపేస్తారా? అని నిలదీశారు. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వబోనని పునరుద్ఘాటించారు. వివేక హత్య కేసులో అన్ని వేళ్ళు మీ ఇంటి వైపే చూపిస్తున్నాయని అన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అడ్డగోలుగా జగన్ దోచేస్తున్నాడు :
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్నాడని పవన్ మండిపడ్డారు. దేశ చట్టాలను కూడా ఖాతరు చేయడం లేదు. అందర్నీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాలంటీర్‌తో డేటా చౌర్యం చేస్తూ చట్టాలు ఉల్లంఘిస్తున్న వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి మైనా ఉందా..? ఇచ్చిన హామీలు ఏమైనా నిలబెట్టుకున్నాడా..? సీపీఎస్ రద్దు చేస్తానన్న వ్యక్తి చేశాడా..? లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వ్యక్తి ఉద్యోగాలు ఇచ్చారా.. ? లిక్కర్‌లో అడ్డగోలుగా దోస్తున్నారు.. లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాగాలేదు. ప్రజాస్వామ్యంలో ఒక అభిప్రాయం చెప్తే దాన్ని ప్రతిఘటించకూడదంటే ఎలా… నా లాంటి వాడిని రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేస్తామంటే ఎలా… రోడ్డుపై తిరగకూడదు.. ఎవరూ చేతులు చూపకూడదు.. బండిలో ఉండి బయటకు రాకూడదు అంటే ఎలా..? అంటూ పవన్ ప్రశ్నించారు.
ఏది ఏమైనప్పటికి రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పొత్తు ఖరారు చేయడం తో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సహాం మొదలైంది. చంద్రబాబు అరెస్ట్ తో డీలా పడ్డ శ్రేణుల్లో పవన్ ఊపిరి పోసినట్లు అయ్యింది. మరి పవన్ కళ్యాణ్ పొత్తు ఫై క్లారిటీ ఇవ్వడం తో వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Read Also : Check for Jagan and Modi : జైలు నుంచి చక్రతిప్పిన చంద్రబాబు!