HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Jana Sena Appeals To Women To Involve In Political Revolution

Jana Sena: వీర మహిళలు సరికొత్త రాజకీయ విప్లవానికి నాంది పలకాలి – ‘నాదెండ్ల మనోహర్’

వీర మహిళలు రాజకీయాలతో పాటు సగటు మనిషికి సాయపడేలా పని చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

  • Author : Hashtag U Date : 20-04-2022 - 7:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Whatsapp Image 2022 04 20 At 7.26.32 Pm Imresizer
Whatsapp Image 2022 04 20 At 7.26.32 Pm Imresizer

వీర మహిళలు రాజకీయాలతో పాటు సగటు మనిషికి సాయపడేలా పని చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. సరికొత్త రాజకీయ వ్యవస్థకు వీర మహిళలు రూపునివ్వాలని కోరారు. స్వేదం చిందించే అన్నదాతకు, గ్రామీణ కూలీలకు జనసేన పార్టీ అండగా నిలిచే విధంగా ప్రత్యేక కార్యక్రమాలకు ప్రాంతీయ మహిళా కమిటీలు రూపకల్పన చేయాలని సూచించారు. బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వీర మహిళా విభాగం ప్రాంతీయ కమిటీల సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సేంద్రీయ సాగు.. గ్రామీణ మహిళలకు ఆర్థిక సాధికారిత అంశం మీద ప్రాంతాల వారీగా చేపడుతున్న కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నింపేలా వీర మహిళలు కృషి చేయాలి. మొదట ప్రాంతీయ కమిటీల్లోని ప్రతి వీర మహిళ ఒక కార్యక్రమాన్ని కొత్త ఆలోచనను మొదలుపెట్టండి. పది మందికీ స్ఫూర్తిని నింపేలా ఆ కార్యక్రమాలు ఉండాలి. ఎలాంటి గొప్ప మార్పు అయినా ఓ చర్య ద్వారానే మొదలు కావాలి. ఆ మార్పు మీ ద్వారా సాకారమవ్వాలి. జనసేన పార్టీకి వీర మహిళలే ప్రత్యేక బలం.. బలగం. పవన్ కళ్యాణ్ మీ నుంచే ఓ కొత్త మార్పుకు శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నారు. ఆ మార్పు తీసుకువచ్చేందుకు మీరంతా సిద్ధం కావాలి. కేవలం వీర మహిళలు అంటే రాజకీయాలకే పరిమితం కాకుండా ఉన్నంతలో పది మందికి సహాయపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్నది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్ష అని అన్నారు నాదెండ్ల మనోహర్.

చేతులు దులుపుకొనే కార్యక్రమాలు వద్దు:
వీర మహిళా విభాగం ప్రాంతీయ కమిటీల ఆధ్వర్యంలో ‘గ్రామీణ ప్రాంతాల్లో సేంద్రీయ సాగు – మహిళా సాధికారత’ అనే అంశాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను అప్పగించారు. మీరు మొదట కొంత మంది మహిళలను గుర్తించి వారిని బృందాలుగా తీర్చిదిద్దండి. వారికి ఆర్ధిక తోడ్పాటు అందించే కార్యక్రమాలు మొదలుపెట్టండి. ఈ కార్యక్రమాలు మరో పది మందిని కదిలించేలా ఉండాలి. ఏదో వితరణ చేసి చేతులు దులుపుకొనే ప్రక్రియలు చేపట్టవద్దు. ప్రతి జిల్లా నుంచి ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వెళ్దాం. మీ ఆలోచనలు గ్రామీణ మహిళలకు రైతు కూలీలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. మొదటి నుంచి చివరి వరకు గ్రామీణులకు మేలు జరిగేలా జనసేన పార్టీ తరఫున పూర్తి బాధ్యతలు స్వీకరించండి.

జిల్లా స్థాయి మహిళా సదస్సులు నిర్వహించండి:
సేంద్రీయ సాగుకు ఎంతో భవిష్యత్తు ఉంది. అయితే అది మొదలు పెట్టిన తర్వాత మూడు నుంచి నాలుగు దఫాలు పంట సాగు చేసిన తర్వాత మాత్రమే ప్రకృతి సిద్ధమైన పంటగా గుర్తిస్తారు. అవసరం అయితే దీనికి సంబంధించి నిపుణులతో చర్చించండి. వచ్చే నెలాఖరు నాటికి అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు మొదలుకావాలి. మే నెలాఖరులోపు జిల్లా స్థాయి వీర మహిళా విభాగం సమావేశాలు ప్రాంతాల వారీగా పూర్తి చేయాలి. ఈ సమావేశాల అజెండా ఒక్కటే జనసేన పార్టీలో వీర మహిళలకు భాగస్వామం కల్పించాలి. పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లాలి. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎలా పని చేయాలి అనే అంశాల మీద చర్చించండి. ప్రాంతీయ కమిటీలు ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. జిల్లా అధ్యక్షులతో చర్చించి ముందుగా జిల్లాల వారీ సమావేశాలు నిర్వహించండి. వీర మహిళా విభాగం ప్రాంతీయ కమిటీలు చేపట్టే ప్రతి కార్యక్రమంలో పార్టీ నాయకులందరినీ భాగస్వాముల్ని చేయండి. సమావేశాలకు అందర్నీ ఆహ్వానించండి. త్వరలో వీర మహిళా విభాగానికి సంబంధించి జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీల ఎంపిక ప్రక్రియ పూర్తవుతంది. ఆ ప్రక్రియలో ప్రాంతీయ కమిటీల తరఫున మీ వంతు భాగస్వామ్యం ఉండేలా చూసుకోండి. ఎవరి జిల్లా బాధ్యతలు వారికి అప్పగించాం. మీకు అప్పగించిన బాధ్యతలు సమర్ధ వంతంగా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాం. ఇది రాజకీయాల్లో సరికొత్త మార్పుకు నాంది కావాలి” అన్నారు నాదెండ్ల మనోహర్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jana Sena
  • manohar nadella
  • Pawan Kalyan

Related News

Pawan Lokesh Frd

ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్న తరుణంలో, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి లోకేష్‌కు ధైర్యం చెప్పడం ఆ బంధాన్ని మరింత ధృడపరిచింది. "అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, కానీ కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు" అని లోకేష్ పేర్కొనడం గమనార్హం.

  • Pawan Kalyan Adopts Two Gir

    అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

  • Pawan is a person who thinks about two or three generations: Nagababu

    నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్

  • ap cabinet meeting highlights

    ఈ నెల 28న ఏపీ క్యాబినెట్ భేటీ

Latest News

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

  • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd