HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Jaiswal Zampa Shine As Rr Comfortably Beat Csk By 32 Runs

RR vs CSK: చెన్నై జోరుకు రాజస్థాన్ బ్రేక్.. హై స్కోరింగ్ మ్యాచ్ లో రాయల్స్ విక్టరీ

ఐపీఎల్ 16వ సీజన్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ జోరుకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది.

  • Author : Naresh Kumar Date : 27-04-2023 - 11:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Csk Vs Rr
Csk Vs Rr

RR vs CSK:  ఐపీఎల్ 16వ సీజన్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ జోరుకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది. హోం గ్రౌండ్ లో అదరగొట్టిన రాజస్థాన్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంజూ నిర్ణయం సరైనదే అని ఓపెనర్లు నిరూపించారు. యశస్వి జైస్వాల్ , జాస్ బట్లర్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా జైస్వాల్ భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు. బట్లర్ కాస్త ఇబ్బంది పడినా… స్వేచ్చగా ఆడిన జైస్వాల్ తొలి వికెట్ కి
8.2 ఓవర్లలోనే 86 పరుగులు జోడించాడు. బట్లర్ ఔటైనా ఏ మాత్రం జోరు తగ్గని జైస్వాల్ మరింత దూకుడుగా ఆడాడు. జైస్వాల్ 43 బంతుల్లో 8 ఫోర్లు , 4 సిక్సర్లతో 77 రన్స్ చేశాడు.
జైస్వాల్ అవుటయ్యే సమయానికి రాజస్థాన్ స్కోరు 132 పరుగులే. దీంతో ఆ జట్టు భారీ స్కోరు చేయడం కష్టమే అనిపించింది. హిట్ మేయర్ కూడా నిరాశ పరిచాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన ధృవ్ జురెల్ కేవలం 15 బంతుల్లోనే 34 పరుగులతో చెలరేగాడు. అతనికి దేవదత్ పడిక్కల్ కూడా మంచి సహకారం అందించాడు. అతను 13 బంతుల్లోనే 27 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. జైపూర్‌లో ఇప్పటి వరకు ఒక్క టీం కూడా 200 స్కోరు చేయలేదు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి టీంగా కూడా రాజస్థాన్ రాయల్స్ రికార్డు సృష్టించింది. చెన్నై బౌలర్లలో తుషార్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. తీక్షణ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఓపెనర్లు ఓ మాదిరి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కి 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ధాటిగా ఆడే క్రమంలో వరుస వికెట్లు కోల్పోయింది. రాయల్స్ కూడా కట్టుదిట్టం గా బౌలింగ్ చేసింది. దీంతో చెన్నై అనుకున్నంత వేగంగా రన్స్ చేయలేక పోయింది. గైక్వాడ్ 47 , రహానే , అంబటి రాయుడు నిరాశ పరిచారు. తర్వాత
శివమ్ దూబె వేగంగా ఆడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి చెన్నై 6 వికెట్లను 170 రన్స్ మాత్రమే చేయగలిగింది. దూబే హాఫ్ సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టిలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది.

https://twitter.com/IPL/status/1651631841961738240/video/1


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adam Zampa
  • Chennai Super Kings
  • IPL 2023
  • RR vs CSK

Related News

Ipl 2026 Playoffs

IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు ఊహించని మలుపులతో అత్యంత రసవత్తరంగా మారింది. ఓటమి అంచున నిలిచి, వరుసగా మూడో పరాజయం చవిచూస్తుందనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై చివరి ఓవర్లో సాధించిన థ్రిల్లింగ్ విజయంతో సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. ఈ గెలుపుతో ఆర్సీబీ 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అదే సమయంలో ఈ ఫలితంతో ముంబై ఇం

    Latest News

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

    • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd