Jagga Reddy Question: అవినీతి పరులను రాజ్యసభకు పంపిస్తారా?
పారిశ్రామికవేత్త బండి పార్థసారధిరెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేయడంపై జగ్గా రెడ్డి మండిపడ్డారు.
- Author : Balu J
Date : 24-05-2022 - 4:27 IST
Published By : Hashtagu Telugu Desk
పారిశ్రామికవేత్త బండి పార్థసారధిరెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేయడంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి రాజ్యసభకు ఫార్మా మేజర్ హెటెరో డ్రగ్స్ యజమాని పార్థసారధి రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేయడంపై జగారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “పెద్ద స్కాం చేసిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఎలా ఇస్తారు” అని ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో రెమ్‌డిసివిర్ మందుల విక్రయాలతో భారీ కుంభకోణంలో కూరుకుపోయిన వ్యక్తికి టీఆర్‌ఎస్ రాజ్యసభ టిక్కెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. రెమ్‌డిసివిర్ వ్యవహరంలో 10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని జగ్గా రెడ్డి ఆరోపించారు. ప్రజల జీవితాలతో ఆడుకున్న వ్యక్తికి రాజ్యసభ టిక్కెట్టు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.