Chandrababu : అచ్చం CBN లానే ఉన్నాడే.. లోకేష్ రియాక్షన్
Chandrababu : ఈ వీడియో లో అచ్చం చంద్రబాబు లా ఉండడం చూసి అంత ఆశ్చర్యం పోవడమే కాదు చంద్రబాబు ఇక్కడికి వచ్చారేంటి అని షాక్ అయ్యారు
- By Sudheer Published Date - 04:51 PM, Sat - 28 December 24

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం.. వినడమే తప్ప..చూసింది ఏం లేదు.. సినిమాల్లో చూపిస్తారు అంతే.. అసలు నిజంగా ఉంటారా..? ఉంటే వాళ్లు ఎక్కడ ఉంటారు అంటూ కొంతమంది వాదిస్తుంటారు. కానీ ఇది నిజమే మనిషిని పోలిన మనుషులు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) మాదిరి ఉండే వ్యక్తులు అప్పుడప్పుడు మీడియా లో వైరల్ అవుతుంటారు.
తాజాగా ఇప్పుడు అలాంటి వ్యక్తి వీడియో నే వైరల్ గా మారింది. ఈ వీడియో లో అచ్చం చంద్రబాబు లా ఉండడం చూసి అంత ఆశ్చర్యం పోవడమే కాదు చంద్రబాబు ఇక్కడికి వచ్చారేంటి అని షాక్ అయ్యారు. అచ్చం చంద్రబాబులా ఉండడమే కాదు ఆయన నడక, హావభావాలు, వాక్చాతుర్యం అన్నీ చంద్రబాబు శైలిలో ఉండటం విశేషం. ఈ వీడియో నారా లోకేశ్ (Nara Lokesh) దృష్టికి చేరడంతో ఆయన సంతోషంతో సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేశారు. “ఆయన చంద్రబాబు గారిలా కనిపించేందుకు, మాట్లాడేందుకు ఎంత కష్టపడ్డారో! ఆయనకు నిజంగా అభిమానిని అయ్యాను” అంటూ లోకేశ్ ట్వీట్ చేయడం విశేషం. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
😂😍 I’ve become a fan of this man. Can see how hard he has worked to look and talk like @ncbn Garu. https://t.co/EcEL3FdFyu
— Lokesh Nara (@naralokesh) December 28, 2024
Read Also : Telangana TDP : తెలంగాణలో టీడీపీ రీ ఎంట్రీ.. పీకే, రాబిన్ శర్మలతో చంద్రబాబు భేటీ