RRR: ఓటీటీలోకి ‘ఆర్ఆర్ఆర్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
- By Balu J Published Date - 03:42 PM, Fri - 13 May 22
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు గా ఆసక్తిగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. ఓటీటీ రిలీజ్ పై అనేక వార్తలొచ్చాయి. మే 13న రిలీజ్ అవుతుందని భావించారు అంతా. కానీ ఈ సినిమా Zee5 లో మే 20 న విడుదలవుతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ శుక్రవారం అఫిషీయల్ గా తెలిపింది. ఈ చిత్రం మార్చి 25న థియేటర్లలో విడుదలైంది, ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 16 రోజుల్లోనే రూ. 1,000 కోట్ల క్లబ్లో చేరింది. పరిశ్రమ వీక్షకుల ప్రకారం ఇది ఇప్పుడు అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ భారతీయ చిత్రం. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘RRR’ అనేది ఇద్దరు భారతీయ స్వాతంత్ర్య సమరయోధులు (అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్) చుట్టూ తిరిగే కల్పిత డ్రామా. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
Related News
Pushpa2 OTT: పుష్ప2 కు భారీ OTT డీల్.. రికార్డుస్థాయిలో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు
Pushpa 2 OTT: పుష్ప 2: ది రూల్ విడుదల కోసం తెలుగువాళ్లే కాదు, యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ యాక్షన్ డ్రామా మరోసారి వార్తల్లో నిలిచింది. హిందీ థియేట్రికల్ రైట్స్‌ను AA ఫిల్మ్స్ అత్యధికంగా రూ. 200 కోట్లు. ఇది ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకీ రాని అత్యధికం. ఇప్పుడు తాజా సంచలనం ఏమిటంటే, ప్రముఖ OTT ప్లాట్�