RRR: అడుగు వేసారో..దిగిపోతాయి..!!
ఆర్ఆర్ఆర్....ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మూవీ విడుదలను పురస్కరించుకుని థియేటర్లన్నీ రెడీ అవుతున్నాయి.
- By Hashtag U Published Date - 02:35 PM, Thu - 24 March 22
ఆర్ఆర్ఆర్….ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మూవీ విడుదలను పురస్కరించుకుని థియేటర్లన్నీ రెడీ అవుతున్నాయి. అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో థియేటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాజమాన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా సినిమా, ప్రసారమయ్యే స్క్రీన్ వద్దకు వెళ్లి ఫ్యాన్స్ సందడి చేయడం…కొన్నిసార్లు స్క్రీన్లను చింపేసి నానా హంగామా చేస్తుంటారు. అలాంటి పరిస్థితులను ద్రుష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్క్రీన్ల ముందు మేకులు కొట్టించారు. దీనికి సంబంధించి ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
సినిమా రిలీజ్ రోజున థియేటర్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు కావాలని కొన్ని థియేటర్ల యజమానులు స్థానిక పోలీస్ స్టేషన్లో అధికారులను కోరుతున్నారు. కాగా ఆయా హీరో అభిమానులు థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. మూవీ చూసేందుకు వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని థియేటర్ల యజమానులతో నటీనటుల అభిమాన సంఘాల ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు.
Related News
RRR : రీ రిలీజ్‌కి సిద్దమైన ఆర్ఆర్ఆర్.. ఎప్పుడంటే..
గ్లోబల్ బ్లాక్ బస్టర్ 'ఆర్ఆర్ఆర్' రీ రిలీజ్‌కి సిద్దమవుతుంది. ఎప్పుడు..? ఏ భాషల్లో..?