Karnataka Polls: కర్ణాటక ఎన్నికల వేళ భారీగా పట్టుబడ్డ నగదు
కర్ణాటక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఆదాయపు పన్ను శాఖ పలు చోట్ల దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా భారీగా నగదు, నగలను స్వాధీనం చేసుకుంది.
- By Praveen Aluthuru Published Date - 04:49 PM, Sat - 6 May 23

Karnataka Polls: కర్ణాటక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఆదాయపు పన్ను శాఖ పలు చోట్ల దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా భారీగా నగదు, నగలను స్వాధీనం చేసుకుంది. మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులకు నిధులు నిధులు సమకూరుస్తున్న కొందరు ఫైనాన్షియర్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది.
బెంగళూరు, మైసూరులోని పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించి రూ.15 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ శనివారం వెల్లడించింది. ఎన్నికల ముందు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు దీన్ని ఉపయోగించుకున్నట్లు భావిస్తున్నారు.
బెంగళూరులోని శాంతి నగర్, కాక్స్ టౌన్, శివాజీ నగర్, ఆర్‌ఎంవీ ఎక్స్‌టెన్షన్, కన్నింగ్‌హామ్ రోడ్, సదాశివనగర్, కుమారపార్క్ వెస్ట్, ఫెయిర్‌ఫీల్డ్ లేఅవుట్‌లలో దాడులు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సోదాల్లో పలు రహస్య ప్రదేశాల్లో భారీ మొత్తంలో లెక్కల్లో చూపని నగదు, నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కర్ణాటక ఎన్నికలకు ముందు ఆదాయపుశాఖ అధికారులు రాష్ట్రంలో ఇటువంటి కార్యకలాపాలను పెద్ద ఎత్తున పర్యవేక్షిస్తున్నారు. ఇంతకు ముందు కూడా రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన డబ్బు పట్టుబడింది. మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకేముంది అన్ని పార్టీలు తమ గెలుపు కోసం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
Read More: Karnataka 2023 : కర్ణాటక ఎన్నికల్లో `ఖర్గే` హత్య వ్యాఖ్యల రచ్చ