IT Raids : ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్‌లో ఐటీ దాడులు.. నష్టాలు చూపి….?
హైదరాబాద్ లోని ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాంపిగ్ మాల్స్‌లో ఐటీ దాడులు జరుగుతున్నాయి..
- By Prasad Published Date - 12:07 PM, Sat - 15 October 22

హైదరాబాద్ లోని ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాంపిగ్ మాల్స్‌లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. రెండో రోజు ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. వీటితో పాటు మొబైల్ స్టోర్స్ అయిన బిగ్ సీ, లాట్ మొబైల్ షోరూమ్స్ లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు . రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు, వార్షిక ఆదాయ లెక్కలపై ఆరా తీస్తున్నారు. లాభాల్లో ఉన్న కంపెనీలను నష్టాల్లో చూపించి.. నిధులను వేరే సంస్థల్లోకి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారుల దగ్గర కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక సంస్థ ద్వారా హానర్ రియల్ ఎస్టేట్ లో ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.