I Am With CBN : గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉద్రిక్తత.. చంద్రబాబుకు మద్ధతుగా భారీగా తరలివచ్చిన టెక్కీలు
- Author : Prasad
Date : 13-09-2023 - 4:58 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఐయామ్ విత్ బాబు అంటూ నల్లరిబ్బన్లు కట్టుకుని ప్లకార్డులను ప్రదర్శించారు. హైదరాబాద్ విప్రో సర్కిల్ వద్ద టెక్కీలు నిరసన తెలిపేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఐటీ ఉద్యోగులను చెదరగొట్టారు. చంద్రబాబు వల్లనే ఐటీ అభివృద్ధి చెందిందని పలువురు ఉద్యోగులు తెలిపారు. తమకు చంద్రబాబు నాయుడు రోల్ మోడల్ అని.. బాబు కోసం కాదు ఏపీ అభివృద్ధి కోసం ప్రజలందరూ బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీలో అభివృద్ధి జరగలేదని ఐటీ ఉద్యోగులు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర కీలకమని.. ఆయన వల్లనే ఐటీ సెక్టార్ అభివృద్ధి చెందిందన్నారు.